మండలిలో ఏం జరుగుతోంది?
రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ మాస్టర్‌ప్లాన్‌పై కౌన్సిల్లో రగడ
మాస్టర్‌ప్లాన్, కౌన్సిల్ అజెండా ఆమోదం ఆలస్యంపై నిలదీసిన సభ్యులు
మేయర్ ప్రెస్‌మీట్ అంశాలపై అధికారులు సమాధానం చెప్పాలని డిమాండ్
నగరంలో విలీన ప్రతిపాదిత పంచాయతీలకు మాస్టర్‌ప్లాన్
రూ.16 కోట్ల ఎస్సీ సబ్‌ప్లాన్ పనుల ప్రతిపాదనలకు ఆమోదం
సాక్షి, రాజమహేంద్రవరం: నగరపాలక మండలిలో ఏం జరుగుతోందో తమకు తెలియడంలేదని, పాలన, నూతన మాస్టర్‌ప్లాన్ ఇలా అనేక అంశాల్లో అంతా అయోమయంగా ఉందని అధికారపార్టీ కార్పొరేటర్లు, స్వతంత్ర కార్పొరేటర్లు మేయర్ పంతం రజనీ శేషసాయి, అధికారులను నిలదీశారు. తామను కార్పొరేటర్లుగా గుర్తించడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం నగర మేయర్ పంతం రజనీశేషసాయి అధ్యక్షతన పాలక మండలి సమావేశం జరిగింది. నూతన మాస్టర్‌ప్లా¯ŒS ఆమోదం ఆలస్యం, అజెండా అంశాలపై మేయర్ ప్రెస్‌మీట్, అజెండా అంశాల ఆమోదం ఆలస్యం, మోరంపూడి–స్టేడియం రోడ్డు ఇలా పలు అంశాలపై వాడీ వేడిగా చర్చ జరిగింది. అజెండాలోని అంశాలను తమ దృష్టికి తీసుకురాకుండానే మరో నాలుగు అంశాలను తమ ప్రసంగంలో చేర్చారని మేయర్‌ను నిలదీశారు. అనంతరం చర్చ ప్రారంభించగా 12వ డివిజన్ స్వతంత్ర కార్పొరేటర్ గొర్రెల సురేష్ మాట్లాడుతూ మేయర్ ప్రెస్మీట్లో మాట్లాడిన అంశాలపై అధికారులు స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. అధికారులకు, మేయర్‌కు సత్సంబంధాలు ఉన్నాయో లేదో చెప్పాలన్నారు. ఆయనకు మద్దతుగా వైఎస్సార్సీపీ కార్పొరేటర్ పిల్లి నిర్మల మాట్లాడుతూ ఇదే విషయాన్ని మేయర్ కూడా ప్రస్తావించారన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ విజయరామరాజు కల్పించుకుని సాధారణంగా అజెండా, సప్లిమెంటరీ అజెండా, టేబుల్ అజెండా అని మూడు అంశాలుంటాయని, అత్యవసరమైన వాటిని అజెండాలో చేర్చే అధికారం చట్ట ప్రకారం తమకు ఉందంటూ పురపాలక చట్టంలోని సెక్షన్లను వివరించారు. అజెండాలో పెట్టడం వరకే తమ పని అని ఆ అంశాలను కౌన్సిల్ ఆమోదిస్తేనే అమలు చేస్తామనడంలో ఎలాంటి సందేహం లేదని స్పష్టం చేశారు.
మోరంపూడి–స్టేడియం రోడ్దు వెడల్పు ఎంత?
మోరంపూడి–స్టేడియం రోడ్డు ఎంత మేర వెడల్పుతో విస్తరించాలని మాస్టర్‌ప్లాన్‌లో ఉందో చెప్పాలని గొర్రెల సురేష్ ప్రశ్నించారు. 80 అడుగులకు మార్క్ చేసినట్టు పత్రికల్లో వచ్చిందని, దీనిపై ప్రజల్లో ఉన్న సందేహాలు నివృత్తి చేయాలన్నారు. కౌన్సిల్లో మేయర్ ఆమోదించిన మేరకే రోడ్డు విస్తరణ ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ సమయంలో టీడీపీ కార్పొరేటర్లు కొందరు 80 అడుగులకే విస్తరించాలని ఆమోదించారనగా, ఈ విషయం అధికారులు చెప్పాలని సురేష్ కోరారు. ఈ రోడ్డుపై వచ్చిన 50 అభ్యంతరాలను డీటీసీపీ కార్యాలయానికి పంపామని, అక్కడ నుంచి నిర్ణయం రావాల్సి ఉందని కమిషనర్ చెప్పారు. మాస్టర్‌ప్లాన్‌లో ఏ అంశాలు సవరించారో వెల్లడించాలని ఎమ్మెల్యే గోరంట్ల అధికారులను కోరారు.
మాస్టర్‌ప్లాన్ ఎప్పుడు పంపారు?
మాస్టర్‌ప్లాన్‌లో చేసిన సవరణలు మినిట్స్‌లో రికార్డు కాలేదన్న విషయం డీటీసీపీ అధికారులు చెబుతున్నారని, ఎందుకు రికార్డు చేయలేదో అధికారులు చెప్పాలని ఎమ్మెల్యే గోరంట్ల కోరారు. అసలు మాస్టర్ ప్లాన్‌ను ప్రభుత్వానికి ఎప్పుడు పంపారో చెప్పాలని సురేష్ డిమాండ్ చశారు. దీనికి కమిషనర్ బదులిస్తూ గత నెల 24న మేయర్ సంతకం చేసి పంపగా తాము సెలవుదినం అయినా 26వ తేదీన పంపామని తెలిపారు. కౌన్సిల్, స్థాయీసంఘం సమావేశాలు నిబంధనల ప్రకారం తరచూ జరగాలని, అక్కడ ఆమోదించిన అంశాలపై వెంటనే సంతకం చేయాల్సిందేనని గోరంట్ల స్పష్టం చేశారు. ఎక్కడ అల్యమైందన్న విషయం అధికారులు రికార్డు చేయాలన్నారు. అనంతరం అజెండాలోని 13 అంశాలను ఆమోదించారు. వీటితోపాటు టెబుల్ అజెండాగా వచ్చిన నగరంలో విలీనానికి ప్రతిపాదించిన 9 గ్రామాలు, వేమగిరికి మాస్టర్‌ప్లాన్ తయారీ, 13వ ఆర్థిక సంఘానికి సంబంధించి ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు రూ.16 కోట్లతో అంచనా వేసిన 44 పనులకు, అమృత్ పథకంలో భాగంగా 2016–17 ఆర్థిక సంవత్సరానికి నగరపాలక సంస్థ క్రెడిట్ రేటింగ్‌ను అంచనావేసే పనిని ఐసీఆర్ఏ సంస్థకు ఇచ్చే ప్రతిపాదనలను కౌన్సిల్ ఆమోదించింది.