హైదరాబాద్‌లో రాజస్తానీ ముఠా హల్ చల్
హైదరాబాద్ : రాజస్తాన్ నుంచి వచ్చిన ఓ ముఠా హైదరాబాద్‌లో ఓ వ్యాపారిని కిడ్నాప్ చేసి డబ్బుల కోసం డిమాండ్ చేసిన సంఘటన కలకలం సృష్టించింది. వ్యాపార నిమిత్తం అహ్మదాబాద్‌కు చెందిన పురోహిత్‌ను ఆ ముఠా సభ్యులు హైదరాబాద్‌కు పిలిచారు. ఇక్కడికి వచ్చిన తరువాత వ్యాపారిని బంధించి అతని కుటుంబ సభ్యుల నుంచి రూ.3 కోట్ల డిమాండ్ చేశారు.
అయితే అంత ఇవ్వలేనంటూ రూ. 25 లక్షలు చెల్లించారు. దాంతో డబ్బు తీసుకున్న కిడ్నాపర్లు వ్యాపారిని వదిలేశారు. కాగా అనంతరం పురోహిత్ కుటుంబీకులు పోలీసులను ఆశ్రయించటంతో ....బోయిన్‌పల్లిలో ముఠా సభ్యులు ఉంటున్న నివాసంపై దాడి చేశారు. అయితే ఈ విషయాన్ని ముందుగానే పసికట్టిన ఆ ముఠా అక్కడ నుంచి పరారైంది. వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు.