పన్ను ప్రధాన కార్యాలయం నిర్మాణానికి శ్రీకారం
న్యూఢిల్లీ: జాతీయస్థాయిలో ప్రత్యేకంగా పన్నుల కార్యాలయం(రాజశ్వ భవన్) నిర్మాణానికి తొలి అడుగు పడింది. రూ.485 కోట్ల అంచనా వ్యయంతో న్యూఢిల్లీలో ఈ కార్యాలయం నిర్మాణానికి ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఈఏ) మంగళవారం ఆమోదముద్ర వేసింది. ఇప్పటివరకూ నార్త్‌బ్లాక్ నుంచి పన్నులకు సంబంధించి ప్రధాన కార్యకలాపాల నిర్వహణ జరుగుతోంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డెరైక్ట్ ట్యాక్సెస్ (సీబీడీటీ), సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్(సీబీఈసీ) ఒకే భవనం నుంచి పనిచేయడానికి తాజా నిర్ణయం దోహదపడనుంది.