ఇక అంతా హైటెక్
న్యూఢిల్లీ: దీన్ద యాళ్ ఉపాధ్యాయ్ మార్గ్‌లోని కాంగ్రెస్ కార్యాలయం (రాజీవ్ భవన్)ను ఆ పార్టీ ఐటీ విభాగం ఈ-మేక్ ఓవర్ చేయనుంది. ఇందులో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఏర్పాటు చేయనుంది. ఈ విషయాన్ని ఐటీ విభాగానికి చెందిన సిబ్బ ంది వెల్లడించారు. ఢి ల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (డీపీసీసీ) ఈ విషయాన్ని తన ఫేస్బుక్ ఖాతాలో వెల్లడించింది. ఏ సమయంలోనైనా ఢిల్లీ శాసనసభకు ఎన్నికలు జరిగే అవకాశాలు మెండుగా ఉండడంతో ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ విజయఢంకా మోగించాలనే లక్ష్యంతో రాష్ట్ర కాంగ్రెస్ విభా గం ముందుకు సాగుతోంది. ఇందులోభాగ ంగా పదిమందితో కూడిన కమ్యూనికేషన్ బృందాన్ని ఏర్పాటు చేసింది.
ఈ-మేకోవర్ ప్రక్రియృ పూర్తికాగానే కమ్యూనికేషన్ బృందం నగరవాసుల అభిప్రాయాలు, స్పందనలను ఎప్పటికప్పుడు విశ్లేషించనుంది. కాగా ఐటీ విభాగం సమన్వయకర్తగా ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ యువజన విభాగం ప్రధాన కార్యదర్శి రాధికా ఖేరా వ్యవహరిస్తున్నారు. ఇక యూ ట్యూబ్ చానల్లో కీలక నాయకుల ప్రసంగాలను అందుబాటులో ఉంచనున్నారు. ఇంకా నిరసన ప్రదర్శనలు, కార్యక్రమాలను కూడా ఎప్పటికప్పుడు అప్లోడ్ చేయనున్నారు. తద్వారా తాము ప్రజల కోసం పనిచేస్తున్నదనే సంకేతాలను ప్రజల్లోకి పంపాలనేది కాంగ్రెస్ పార్టీ నాయకుల లక్ష్యం. అందులోభాగంగానే ఫేస్బుక్లో ఖాతా తోపాటు ట్విటర్లోనూ మరో ఖాతా తెరిచింది. దీంతోపాటు పార్టీ నాయకులు, కార్యకర్తలకు సోషల్ మీడియాపై అవగాహన కల్పించడం కోసం త్వరలో శిక్షణ కార్యక్రమాలను నిర్వహించనుంది.