అమెరికా స్కామ్; భారతీయుల నేరాంగీకారం
టెక్సాస్: అమెరికాను కుదిపేసిన అతిపెద్ద కాల్ సెంటర్ స్కామ్ కమ్ హవాలా కేసులో భారత్‌కు చెందిన హార్దిక్ పటేల్ (31), రాజుభాయ్ పటేల్ (32), విరాజ్ పటేల్ (33), దిలీప్ కుమార్ అంబల్ పటేల్ (53), పాకిస్థాన్‌కు చెందిన ఫహద్ అలీ (25)లు అమెరికా, దక్షిణ టెక్సాస్‌లోని జిల్లా కోర్టు జడ్జీ డేవిడ్ ఇట్నర్ ముందు తమ నేరాన్ని అంగీకరించారు. వారికి శిక్షలు విధించే తేదీలను మాత్రం ఇంకా ప్రకటించలేదు.
అమెరికా పౌరులను లక్ష్యంగా సాగిన ఈ స్కామ్ ఇటు అమెరికా, భారత్ దేశాలకు విస్తరించింది. 2012, ఆగస్టులో ప్రారంభమైన ఈ స్కామ్‌లో మొత్తం 52 మంది వ్యక్తులు, భారత్‌లోని ఐదు కాల్ సెంటర్లు పాత్రదారులు. ఇప్పటికే ఈ స్కామ్‌లో అరెస్టయిన వ్యక్తుల్లో కొందరు తమ నేరాన్ని అంగీకరించగా, మరికొందరు అభియోగాలను కోర్టు ముందు సవాల్ చేశారు. అలా సవాల్ చేసిన నిందితులు కేసు విచారణ పురోగతినిబట్టి తమ నేరాన్ని అంగీకరిస్తూ వస్తున్నారు. ఆ క్రమంలోనే గత నెల మే 26వ తేదీ నుంచి జూన్ ఆరవ తేదీ వరకు ఐదుగురు భారతీయులు, ఒక పాకిస్థానీయుడు నేరాన్ని అంగీకరించారు.
తాజాగా నేరాన్ని అంగీకరించిన వ్యక్తుల్లో హార్దిక్ పటేల్ అహ్మదాబాద్ కేంద్రంగా కాల్ సెంటర్ నడిపారు. దానికి మేనేజర్‌గా పనిచేసిన ఆయన ఆ తర్వాత అమెరికాకు వచ్చారు. మిగతా నిందితుల్లో ఎక్కువ మంది అమెరికాలోని వివిధ రాష్ట్రాల్లో నివసిస్తూ హవాలా దందాకు పాల్పడ్డారు. అమెరికా పౌరులకు చెందిన డాటాను భార™Œ లోని ఐదు కాల్ సెంటర్లు తస్కరించడం, అమెరికా చట్టాలను, నిబంధనలను ఉల్లంఘించినందున జరిమానాలు, జైలు శిక్షలు పడతాయని వారిని బెదిరించి అక్రమంగా వసూళ్లు చేయడం, ఆ సొమ్మును హవాలా మార్గాల్లో మళ్లించడం ఈ మొత్తం స్కామ్ సారాంశం. ఆన్లైన్ ద్వారా, నగదు లోడెడ్ కార్డుల ద్వారా, ఇతర మార్గాల్లో స్కామ్ పాత్రదారులు అక్రమ వసూళ్లకు పాల్పడ్డారు.