Rakesh Khurana
-
రక్షాబంధన్
-
మంగుళూరుకీ మల్టినేషనల్ కీ లింకేమిటి?
మీరు మంగుళూరు యూనివర్సిటీలో చదువుకున్నారా? అయితే మీకు విశ్వ విఖ్యాత మల్టినేషనల్ కంపెనీకి గ్లోబల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అయ్యే అవకాశాలు మెండుగానే ఉన్నాయి. అవును. మైక్రోసాఫ్ట్ కి మెగా హెడ్ అయిన సత్య నాదెళ్ల మంగుళూరు యూనివర్సిటీలో చదువుకున్నాడు. అన్నీ కలిసొస్తే నోకియా కార్పొరేషన్ కీ మంగుళూరు యూనివర్సిటీ విద్యార్థే కాబోతున్నాడు. నోకియా టెలికామ్ ఎక్విప్ మెంట్ బిజినెస్ కి హెడ్ గా ఉన్న రాజీవ్ సూరి ఈ నెలాఖరుకి గ్లోబల్ హెడ్ గా హాట్ సీట్ లో కూర్చుంటారని తెలుస్తోంది. ఫిన్లండ్ కేంద్రంగా ఉండే రాజీవ్ సూరి మంగుళూరు యూనివర్సిటీలో ఎలక్ట్రానిక్స్ టెలికమ్యూనికేషన్స్ లో ఇంజనీరింగ్ డిగ్రీ తీసుకున్నారు. గత చాలా ఏళ్లుగా నోకియాలో పనిచేస్తున్నారు. దీంతో ప్రపంచప్రఖ్యాత మల్టినేషనల్స్ ని ముందుండి నడిపించే మహారథుల్లో మరొక మనోడు చేరాడు. మల్టి నేషనల్స్ పై మనోళ్లదే పెత్తనం మైక్రోసాఫ్ట్ సత్యా నాదెళ్ల పెప్పికో ఇందిరా నూయి రెకెట్ బెంకినేర్ రాకేశ్ కపూర్ మాస్టర్ కార్డ్ అజయ్ బంగా డౌచ్ బ్యాంక్ అంశు జైన్ హార్వర్డ్ కాలేజీ రాకేశ్ ఖురానా డీబీఎస్ గుప్త పీయూష్ గుప్త -
హార్వర్డ్ కాలేజీ డీన్‌గా భారతీయ అమెరికన్ ఫ్రొఫెసర్
న్యూయార్క్: అమెరికాలోని ప్రఖ్యాత హార్వర్డ్ కాలేజీ డీన్‌గా భారతీయ అమెరికన్ ప్రొఫెసర్ రాకేష్ ఖురానాను నియమించారు. ప్రస్తుతం ఆయన హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు. ఖురానా 1998లో హార్వర్డ్ బిజినెస్ స్కూల్, హార్వర్డ్ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ ఉమ్మడి కార్యక్రమం ద్వారా పిహెచ్డి పొందారు. రాకేష్ ఖురానాను డీన్‌గా నియమిస్తున్నట్లు ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ (ఎఫ్ఏఎస్) డీన్ మైఖేల్ డి స్మిత్ ఈరోజు ప్రకటించారు. స్కాలర్‌గా, అధ్యాపకుడుగా కాలేజీ కోసం ఖురానా చేసిన కృషిని ఆయన కొనియాడారు.