అందుకే పేరు వేసుకున్నా : మారుతి
రక్షిత్, స్వాతి జంటగా ‘వీడు తేడా’ ఫేమ్ చిన్నికృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘లండన్ బాబులు’. మారుతి టాకీస్ పతాకంపై దర్శకుడు మారుతి నిర్మిస్తున్న ఈ చిత్రం ట్రైలర్‌ను బుధవారం విడుదల చేశారు. మారుతి మాట్లాడుతూ–‘‘స్వీట్ మ్యాజిక్ ప్రసాద్‌గారు ‘ఆండవన్ కట్టళై’ అనే తమిళ సినిమాను చూసి, నన్ను చూడమన్నారు. ఫక్తు కమర్షియల్ సినిమా అనుకున్నా, కానీ విజయ్ సేతుపతితో మాట్లాడాక చాలా ప్యాషన్‌తో చేశారని తెలిసింది. అందుకే రీమేక్ చేశాం.
పాస్‌పోర్ట్ కోసం పడే తిప్పల్ని ఈ సినిమాలో చూపిస్తున్నాం. మామూలుగా నేను నిర్మించే సినిమాలకు పేరు వేసుకోవడానికి చాలా ఆలోచిస్తాను. కానీ, నాకు ‘లండన్ బాబులు’ బాగా నచ్చడంతో వేసుకున్నా’’ అన్నారు. ‘‘సినిమాలకు దూరంగా వైజాగ్‌లో ఉన్న నన్ను పిలిచి మరీ మారుతిగారు నాకు ఈ అవకాశం ఇచ్చారు.
అందుకు ఆయనకు థ్యాంక్స్. రక్షిత్ అనే మంచి హీరోని పరిచయం చేశాననే ఆనందం నాకు ఎప్పుడూ ఉంటుంది’’ అన్నారు చిన్నికృష్ణ. రక్షిత్, స్వాతి, హీరో నిఖిల్, దర్శకులు పరశురామ్, అనిల్ రావిపూడి, సుధీర్‌వర్మ, చందు మొండేటి, ‘డార్లింగ్’ స్వామి, శ్రీకాంత్ అడ్డాల, నటులు జీవా, ఉద్ధవ్, విఠల్, అజయ్ ఘోష్ తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: శ్యామ్ కె. నాయుడు, సంగీతం: కె.