ఏటీఎంలో నగదు చోరీకి విఫలయత్నం
విస్సన్నపేట, న్యూస్‌లైన్ : స్థానిక సిండికేట్ బ్యాంక్ ఏటీఎంలో నగదు అపహరణకు విఫలయత్నం జరిగింది. సేకరించిన వివరాల ప్రకారం.. సిండికేట్ బ్యాం క్కు చెందిన ఏటీఎంలోకి శుక్రవారం అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో ఓ వ్యక్తి గుర్తుపట్టడానికి వీలులేని విధంగా తలకు షర్టు చుట్టుకుని చొరబ డ్డాడు. ఏటీఎంను గునపంతో పొడవగా ముందు భాగంలో ఉన్న ఫైబర్ డూమ్ ఊడిపోయింది. తరువాత అందులో నుంచి నగదు దొంగిలిం చలేక దుండగుడు వెనుదిరిగాడు.
శనివారం విధులకు హాజరైన సిబ్బంది ఈ ఘటనను గుర్తించి బ్రాంచ్ మేనేజర్ రమాకాంతరావుకు చెప్పారు. ఆయన స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఎస్సై దుర్గాప్రసాద్ క్లూస్‌టీంను రప్పించి ఘ టనాస్థలిలో ఆధారాలు సేకరించారు. ఈ ఘ టనలో నగదు అపహరణకు గురవలేదని ఎస్సై తెలిపారు. సీసీ కెమెరాలో రికార్డయిన దృశ్యాలను పరిశీలించి, చోరీకి యత్నించిన వ్యక్తిని పట్టుకుంటామన్నారు.
కాగా, గ్రామంలోని మెయిన్ సెం టర్లో రోడ్డు పక్కనే ఉన్న ఏటీఎంలో చోరీకి విఫలయత్నం జరిగిందని తెలియడంతో స్థాని కులు భయాందోళనలకు గురయ్యారు. విద్యుత్ సరఫరా లేని సమయంలో ఈ ఘటన జరిగి ఉం టుందని వారు పేర్కొంటున్నారు. రాత్రి వేళల్లో వి ద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా చూడాలని కోరుతున్నారు.