ramayyaku
-
రామయ్యకు నిత్య కల్యాణం
నేడు శ్రావణ శుక్రవారం పూజలు భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారికి గురువారం వైభవంగా నిత్యకల్యాణం జరిపారు. ఉదయం సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర సేవా కార్యక్రమాలు నిర్వహించారు. పవిత్ర గోదావరి నుంచి తీర్థజలాలు తీసుకు వచ్చి భద్రుని గుడిలో అభిషేకం జరిపారు. స్వామివారి నిత్యకల్యాణ మూర్తులను ఆలయ ప్రాకార మండపంలో వేంచేయింపజేసి విశ్వక్సేనపూజ, పుణ్యహవచనం గావించారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీతధారణ చేశారు. అర్చకులు ఆలయ విశిష్టతను వివరించారు. భక్తుల గోత్రనామాలను చదివారు. మంత్రోచ్ఛరణల మధ్య నిత్యకల్యాణం జరిపారు. స్వామివారి శేషవస్త్రాలు, తీర్థప్రసాదాలను భక్తులకు అందించారు. – శ్రావణ శుక్రవారాన్ని పురస్కరించుకొని శ్రీసీతారామచంద్రస్వామివారి ఉప ఆలయంలోని శ్రీలక్ష్మీతయారమ్మవారి సన్నిధిలో ఉదయం 8.30 గంటల నుంచి అభిషేకం నిర్వహిస్తామని ఈఓ రమేశ్‌బాబు, ప్రధానార్చకులు జగన్నాథచార్యులు తెలిపారు. ప్రాకారమండపంలో అమ్మవారికి స్నపన తిరుమంజనం జరపనున్నారు. తిరుచానారులో ఉన్న పద్మావతి అమ్మవార్లకు జరిపిన విధంగానే ధూపదీప నైవేద్యాలు, షోడపచారాలు, సహస్రధారలు, తులసీ మాలలు, కుంభ, ధ్వజ, అష్ట, ద్వాదశ హారతులు, నారీకేళ జలాలు, 108 లీటర్ల క్షీరాలు, హరిద్రాచూర్ణాలు, సమస్త నదీ తీర్థములతో అమ్మవారికి తిరుమంజనం జరపనున్నారు. -
రామయ్యకు నిత్యకల్యాణం
భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామివారికి మంగళవారం నిత్యకల్యాణం నిర్వహించారు. ఉదయం స్వామివారికి సుప్రభాతసేవ, సేవాకాలం, ఆరాధన తదితర కార్యక్రమాలు చేశారు. పవిత్ర గోదావరి నుంచి తీర్థజలాలను తీసుకువచ్చి భద్రుని ఆలయంలో అభిషేకం నిర్వహించారు. స్వామివారి నిత్య కల్యాణ మూర్తులను ఆలయ ప్రాకార మండపానికి వేంచేయింపజేసి ముందుగా విశ్వక్సేన పూజ, పుణ్యహవచనం గావించారు. అష్టోత్తర శతనామార్చన చేశారు. వేదమంత్రోచ్ఛారణల మ«ధ్య కల్యాణం నిర్వహించారు. కల్యాణంలో పాల్గొన్న భక్తులకు స్వామివారి శేష వస్త్రాలు, తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో ఆలయ అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు. ఆంజనేయస్వామికి అభిషేకం శ్రీసీతారామచంద్రస్వామి వారికి అభిముఖంగా ఆలయ ప్రాంగణంలో వేంచేసియున్న ఆంజనేయస్వామి వారికి మంగళవారం వైభవంగా అభిషేకం నిర్వహించారు. ఉదయం గోదావరి తీర్థ జలాలను తెచ్చి, పంచామృతాలు, నారికేళజలాలు, సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. చందన గంధాలను ధూపదీప నైవేద్యాలను సమర్పించారు. భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నారు. -
రామయ్యకు స్వర్ణపుష్పార్చన
భద్రాచలం : భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారికి ఆదివారం వైభవంగా స్వర్ణ పుష్పార్చన చేశారు. ఉదయం స్వామి వారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర కార్యక్రమాలు నిర్వహించారు. పవిత్ర గోదావరి నది నుంచి తీర్థ జలాలను తీసుకుని వచ్చి అంతరాలయంలో అభిషేకం చేశారు. అనంతరం 108 స్వర్ణ పుష్పాలతో అష్టోత్తర శతనామార్చన చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తదుపరి స్వామి వారి నిత్యకల్యాణ మూర్తులను పల్లకీలో ఊరేగింపుగా తీసుకుని వచ్చి ఆలయ బేడా మండపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్వర్ణ సింహాసనంపై కూర్చుండబెట్టారు. ముందుగా విశ్వక్సేన పూజ, పుణ్యహవచనం చేశారు. అర్చకులు స్వామి, అమ్మవారి వంశక్రమాన్ని, ఆలయ విశిష్టతను భక్తులకు తెలిపారు. వేద పండితులు వేద విన్నపాలు చేశారు. కల్యాణంలో పాల్గొన్న భక్తుల గోత్రనామాలను స్వామి వారికి విన్నవించారు. అనంతరం రామయ్యకు అత్యంత వైభవోపేతంగా నిత్యకల్యాణం నిర్వహించారు. అర్చకులు స్వామి వారి శేష వస్త్రాలను, తీర్థ ప్రసాదాలను భక్తులకు అందజేశారు. కార్యక్రమంలో ఆలయ అర్చకులు, వేద పండితులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.