'అసమానతలు తొలగిపోయేలా ఓటు వేయండి'
హరిద్వార్ : పటిష్టమైన ప్రజాస్వామ్యవ్యవస్థ రావాలంటే ప్రతిఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబా పిలుపునిచ్చారు. ఆర్ధిక, సామాజిక అసమానతలు తొలగిపోయేలా ప్రజలు ఓటు వేయాలని కోరారు. హరిద్వార్‌లో రాందేవ్ బాబా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆయన ప్రధాన అనుచరుడు బాలకృష్ణ కూడా ఓటు వేశారు.