రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి
న్యూఢిల్లీ: రాఖీ పండుగ సందర్భంగా రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీలు దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. రాఖీ పండుగ సందర్భంగా దేశ ప్రజలందరూ తమ మధ్య సౌభ్రాతృత్వ భావనలను పునరుద్ధరించుకుంటారని కోవింద్ విశ్వాసం వ్యక్తం చేశారు. రాఖీ పండుగ సందర్భంగా మహిళల గౌరవాన్ని కాపాడడానికి పునరంకితం కావాలని ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ ప్రజలను కోరారు.