ramp appearance
-
అందాలు ఆరబోద్దామనే అత్యుత్సాహంలో..
-
అందాలు ఆరబోద్దామనే అత్యుత్సాహంలో..
ఓ మోడల్ అత్యుత్సాహం ప్రాణం మీదకు తెచ్చింది. తాను ధరించిన వినూత్న వస్త్రాలను ప్రదర్శించేందుకు ర్యాంప్‌పై ముందుకెళ్లిన మోడల్ అలంకరణకు నిప్పు అంటుకోవడంతో క్షణాల్లో భయానక వాతావరణం అలుముకుంది. కళ్లుమూసి తెరిచేలోగా మంటలు ఆమె తలపై డిజైన్ చేసిన ప్రత్యేక అలంకరణను కాలి బూడిదైంది. నిర్వాహకులు అప్రమత్తంగా ఉండి మంటలు ఆర్పడంతో ఆమె స్వల్పగాయాలతో బయటపడింది. ఈ ఘటన ఎవన్ సాల్వడోర్లో చోటుచేసుకుంది. ర్యాంప్ చివర్లో చేతిలో దివిటీలతో కొంతమంది వ్యక్తులను ఆకర్షణగా పెట్టడంతో వారి చేతుల్లోని నిప్పు కాస్త ఆమె డిజైన్‌కు అంటుకోవడంతో ఆ ప్రమాదం సంభవించింది. ఆ వీడియోను మీరు కూడా వీక్షించండి. -
ర్యాంప్ పై సందడి చేసిన కొత్త జంట
బాలీవుడ్ యంగ్ జనరేషన్ లో మోస్ట్ టాలెంటెడ్ అండ్ సక్సెస్ ఫుల్ యంగ్ హీరో షాహిద్ కపూర్.. మొన్నటి వరకు మోస్ట్ వాంటెడ్ బ్యాచిలర్ గా ఉన్న ఈ హీరో ఈ మధ్యే ఓ ఇంటి వాడయ్యాడు. పెళ్లి తరువాత షాందార్ మూవీ షూటింగ్ తో బిజీ అయిపోయిన షాహిద్ కొంచెం గ్యాప్ తీసుకొని హనీమూన్ ప్లాన్ చేసుకున్నాడు. సినిమా ప్రమోషన్ల మధ్యలో అప్పుడప్పుడు బ్రేక్ తీసుకుంటూ భార్యతో కలిసి ఫారిన్ లోకెషన్లలో డ్యూయెట్లు పాడుతున్నాడు. అయితే పెళ్లి తరువాత ఇంత వరకు ఒక్కసారి కూడా ఈ కపుల్ కలిసి కెమెరా కళ్లకు చిక్కలేదు. దీంతో చాలా రోజులుగా వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ కోసం షాహిద్ భార్యతో కలిసి ఓ ర్యాంప్ షోలో పాల్గొన్నాడు. సింపుల్ బ్లాక్ లో షాహిద్ ఆకట్టుకోగా మిసెస్ షాహిద్ మీరా మాత్రం స్టార్ హీరోయిన్లకు తీసిపోని విధంగా గ్లామర్ ఒలకపోసింది. దీంతో ఈ ఇద్దరు కలిసి స్క్రీన్ జోడిగా నటిస్తే ఎలా ఉంటుంది.. అన్న టాక్ కూడా బాలీవుడ్ లో స్టార్ట్ అయ్యింది.