Ranga theater
-
'సలార్' రిలీజ్: ప్రభాస్ వీరాభిమాని మృతితో..
శ్రీసత్యసాయి, సాక్షి: సలార్ సినిమా రిలీజ్ నేపథ్యంలో అభిమానులు పండుగు చేసుకుంటుండగా.. ఊహించని విషాదం చోటుచేసుకుంది. ధర్మవరంలో థియేటర్ వద్ద ప్రమాదవశాత్తూ ఓ వీరాభిమాని మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే.. పట్టణ కేంద్రంలోని రంగా సినిమా థియేటర్లో 'సలార్' సినిమా విడుదల సందర్భంగా బాలరాజు(27) థియేటర్ ఆవరణలో సలార్ మూవీ బ్యానర్ కడుతున్నాడు. ఆ సమయంలో ప్రమాదవశాత్తు ఫ్లెక్సీ రాడ్ పైనున్న హై వోల్టేజ్ తీగలకు తగలడంతో షాక్‌కు గురై అక్కడికక్కడే కుప్పకూలాడు. వెంటనే దగ్గరలోని హాస్పిల్‌కి తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. విషయం తెలుసుకున్న కుటుంబీకులు కన్నీటి పర్యంతమయ్యారు. మరోవైపు బంధువులు, ప్రభాస్ ఫ్యాన్స్ థియేటర్ వద్ద న్యాయం చేయాలంటూ, మృతిచెందిన బాలరాజు కుటుంబాన్ని ఆదుకోవాలంటూ ఆందోళన చేపట్టారు. ఇవి కూడా చదవండి: కామారెడ్డిలో దారుణం: క్షణికావేశంలో కొడుకును పొడిచి, ఆపై తండ్రి కూడా.. -
28 నుంచి చిల్డ్రన్ థియేటర్ ఫెస్టివల్
సాక్షి, హైదరాబాద్: చిల్డ్రన్స్ థియేటర్ ఫెస్టివల్ నాల్గవ ఎడిషన్ ఈ నెల 28, 29, 30 తేదీల్లో హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో జరుగుతుందని సినీ నటి, మాజీ మిస్ ఇండియా నమ్రతా శిరోద్కర్ తెలిపారు. మంగళవారమిక్కడ బంజారాహిల్స్‌లోని ఓ హోటల్లో జరిగిన కార్యక్రమంలో ఆమె ఈ ఫెస్టివల్‌ను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. పిల్లల్లో ప్రతిభను వెలికితీసేందుకు, వారికి మంచి కాలక్షేపాన్ని అందించేందుకు ఈ ఫెస్టివల్ దోహదపడుతుంద న్నారు. ముంబైకి చెందిన రంగాథియేటర్, ప్రాసేనియం ప్రొడక్షన్స్, న్యూఢిల్లీకి చెందిన కథకథా థియేటర్ తదితర ప్రఖ్యాత థియేటర్ గ్రూప్‌లు ఫెస్టివల్లో పాలుపంచుకుంటున్నాయన్నారు. అంతర్జాతీయంగా ప్రసిద్ధి పొందిన నాటక సమాజాలను ఇక్కడి వారికి పరిచయం చేయడం దీని లక్ష్యమని నిర్వాహకురాలు వైశాలి బిష్ట్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సమాచార పౌరసంబంధాలశాఖ డెరైక్టర్ సుభాష్‌గౌడ్ కూడా పాల్గొన్నారు.