‘ఏకాదశి’ వైభవం
చెన్నై, సాక్షి ప్రతినిధి : వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని శనివారం రాష్ట్రంలో ని వైష్ణవాలయాలన్నీ భక్తులతో కిక్కిరిసిపోయూయి. ఉత్తర ద్వారం నుంచి వెలుపలికి వచ్చిన ఉత్సవమూర్తులను దర్శిం చుకున్న భక్తులు తరించారు. దేశంలోని 108 ప్రసిద్ధ వైష్ణవాలయాల్లో ప్రథమం గా భావించే తిరుచ్చిరాపల్లి శ్రీరంగంలోని శ్రీరంగనాథుని ఆలయంలో విశేష పూజలు నిర్వహించారు. విష్ణుమూర్తి స్వరూపం నుంచి వివిధ దేవతామూర్తులుగా అవతరించిన అన్ని ఆలయాల్లో వైకుంఠ ఏకాదశి వైభవంగా సాగింది. ఈ ఆలయాల్లో డిసెంబరు, జనవరి మాసాల్లో పగల్‌పత్తు, రాపత్తు ఉత్సవాలను 21 రోజుల పాటూ నిర్వహిస్తుం టారు. ఈఉత్సవాల్లో భాగంగా వైకుంఠ ఏకాదశి అత్యంత ప్రాధాన్యమైనది.
గత నెల 31వ తేదీన తిరునెడు దండకం ఆ తరువాత ఈనెల 1వ తేదీన పగల్‌పత్తు ఉత్సవాలు వైష్ణవాలయాల్లో ప్రారంభమైనాయి. పగల్‌పత్తు ఉత్సవాల్లో పదోరోజు, వైకుంఠ ఏకాదశి ముందురోజైన శుక్రవారం నాడు రంగనాధుడు మోహినీఅవతారంలో దర్శనమిచ్చారు. ఉత్తర ద్వారం గుండా భక్తుల కోసం రంగనాధుడు బయటకు వచ్చేటపుడు వైకుంఠ ద్వార దర్శనం కోసం శుక్రవారం రాత్రి 11 గంటలకే వేలాది భక్తులు చేరిపోయారు. శనివారం తెల్లవారుజామున సరిగ్గా 4.30 గంటలకు స్వామివారు వైకుంఠద్వారం నుంచి వెలుపలికి రాగానే రంగ...రంగా అనే భక్తుల నినాదాలతో శ్రీరంగంలోని ఆలయం మార్మోగిపోయింది. శ్రీరంగం ఆలయ జీయర్, రాష్ట్ర మంత్రులు కామరాజ్, ఆనందన్, సుబ్రమ ణి, పలువులు అధికారులు స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులను అదుపుచేసేందుకు సుమారు 3వేల మంది పోలీసులు బందోబస్తు లో నిమగ్నమయ్యూరు. వైకుంఠ ఏకాదశి దాటిపోగా రాపత్తు ఉత్సవాలు ప్రారంభమై ఈనెల 20వ తేదీ వరకు సాగుతాయి.
చెన్నై ట్రిప్లికేన్‌లోని పార్థసారథి ఆలయంలో సైతం తిరుమొళి తిరునాళ్ పేరుతో ఈనెల 1వ తేదీన పగల్‌పత్తు ఉత్సవాలను ప్రారంభించారు. నగరంలోనే ఏకైక ప్రాచీన, అతి పెద్ద వైష్ణవాలయం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మూలవిరాట్ వద్ద విశేష అలంకరణలో ఉన్న ఉత్సవమూర్తి సరిగ్గా 4.15 గంటలకు ఉత్తర ద్వారం గుండా వెలుపపలకు వచ్చారు. అర్ధరాత్రి నుంచే అక్కడ వేచి ఉన్న భక్తులు స్వామిని చూడగానే ఒక్కసారిగా గోవిందా...గోవిందా అనే నామస్మరణతో ఆలయ ప్రాంగణాన్ని మార్మోగించారు. వేలాదిగా వచ్చిన భక్తులను అదుపుచేయడం పోలీసులకు కష్టసాధ్యమైంది. గర్భగుడి నుంచి వెలుపలకు వచ్చిన ఉత్సవమూర్తి 5.45 గంటల వరకు ఆలయం చుట్టూ మూడు ప్రదక్షిణలు చేశారు.
టీటీడీలో శ్రీవారి సందడి
చెన్నై టీ నగర్‌లోని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆలయంలో వైకుంఠ ఏకాదశి పూజలను ఘనంగా నిర్వహించారు. టీటీడీ స్థానిక సలహామండలి అధ్యక్షడు ఆనందకుమార్ రెడ్డి నేతృత్వంలో సభ్యులు ప్రత్యేక దర్శన ఏర్పా ట్లు చేశారు. రాత్రి 10 గంటల నుంచే శ్రీవారి దర్శనానికి భక్తులు బారులుతీరారు. రాత్రి 1.45 గంటలకు పూజలు ప్రారంభించి తెల్లవారుజామున మండలి సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆనంతరం వైకుంఠద్వార దర్శనం ప్రారంభమైంది. శ్రీనివాసుడు, పద్మావతి అమ్మవారి మూలవిరాట్తోపాటూ వెనుక భాగంలో ఉన్న శేషశయనుడి రూపంలో ఉన్న శ్రీవారిని అబ్బురపరిచే విధంగా అలంకరించారు. శనివారం తెల్లవారుజాము నుంచి రాత్రి వరకు సుమారు 80 వేలకు పైగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.