కొత్త నినాదం.. ‘జై దక్షిణ తెలంగాణ’
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : రంగారెడ్డి జెడ్పీ సమావేశంలో శనివారం కొత్త నినాదం పుట్టుకొచ్చింది. దక్షిణ తెలంగాణ జిల్లాల పట్ల ముఖ్య మంత్రి కె.చంద్రశేఖర్‌రావు టీఆర్ఎస్ ప్రభుత్వం వివక్ష పాటిస్తోందని ఆరోపిస్తూ కాంగ్రెస్ సభ్యులు ‘జై దక్షిణ తెలంగాణ’ అని నినదించడం చర్చనీయాంశమైంది.
ప్రాజెక్టుల అమలులో ద క్షిణ తెలంగాణకు తీరని అన్యాయం చేస్తున్నారని, సీఎం కేసీఆర్ సొంత నియోజకవర్గమైన గజ్వేల్ కోసం.. రంగారెడ్డి జిల్లా ప్రయోజనాలను ఫణంగా పెడుతున్నారని నినాదాలు చేశారు.