బావతో సినిమా చేస్తానంటున్న సౌందర్య
తండ్రి హీరోగా కొచ్చాడయాన్ సినిమా తీసిన రజనీకాంత్ కుమార్తె సౌందర్య.. ఇప్పుడు తన బావ ధనుష్‌తో ఓ సినిమా తీయాలనుకుంటోంది. బాలీవుడ్లో ధనుష్ హీరోగా వచ్చిన 'రాంఝణా' చిత్రం చూసిన సౌందర్య.. అందులో అతడి యాక్షన్ చూసి థ్రిల్లయిపోయింది. సమీప భవిష్యత్తులోనే ధనుష్ సినిమాకు దర్శకత్వం వహించాలని అనుకుంటోంది.
''కుందన్ పాత్రలో బావగారు ఎంత బాగా ఒదిగిపోయారో.. నాకు ఆ సినిమా భలే నచ్చేసింది. ఇక ఆ పాటలు ఊకడా చాలా బాగున్నాయి'' అని ఆమె తెలిపింది. ధనుష్ సినిమాకు దర్శకత్వం వహించాలని తనకు ఉన్నా.. సీనియర్ నటుడు కాబట్టి ఆయన డేట్లు ఇస్తే తప్పకుండా చేస్తానని అంటోంది. '3' సినిమాకు దర్శకత్వం వహించిన రజనీ కుమార్తె ఐశ్వర్యను ధనుష్ పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. తమ కుటుంబంలో ఒక్క తన భర్త తప్ప.. అందరూ సినిమా పరిశ్రమకు చెందినవాళ్లేనని సౌందర్య చెప్పింది.