ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు
ఈరోజు మీతో పాటు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు : రంజితా కౌర్ (నటి), విజయ బాపినీడు (దర్శకుడు)
ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న వారి వ్యక్తిగత సంవత్సర సంఖ్య 3. ఇది బృహస్పతికి సంబంధించిన సంఖ్య కాబట్టి మంచి మేధోవికాసం, తెలివి తేటలు, ధారణ శక్తి కలుగుతాయి. విషయ పరిజ్ఞానం పొందుతారు. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తారు. నిర్మాణాత్మకంగా వ్యవహరిస్తారు. చాలా కాలంగా బదిలీ కోసం ఎదురు చూస్తున్న వారి కల ఫలిస్తుంది. పాతస్నేహితులను కలుసుకుంటారు. న్యాయకోవిదులకు, వైద్యులకు, యూనిఫారం ధరించే ఉద్యోగులకు మంచి పేరు వస్తుంది.
వీరు పుట్టిన తేదీ 22. ఇది రాహు సంఖ్య. 22 అనేది మాస్టర్ నంబర్ కావడం వల్ల స్నేహితులతో, అధికారులతో ఉన్న మనస్పర్థలు తొలగిపోయి, సత్సంబంధాలు ఏర్పడతాయి. విదేశీవిద్య, ఉద్యోగాల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న గ్రీన్‌కార్డ్ ఈ సంవత్సరం కచ్చితంగా వచ్చే అవకాశం ఉంది. కంప్యూటర్, సైన్స్ రంగాలలోని విద్యార్థులకు కోరుకున్న కోర్సులలో సీటు వస్తుంది. ఉద్యోగులకు జీతాలు పెరుగుతాయి. లక్కీ నంబర్స్: 1,2,3, 5,6,9; లక్కీ కలర్స్: రోజ్, ఆరంజ్, క్రీమ్, గోల్డెన్, శాండల్, బ్లూ; లక్కీ డేస్: బుధ, గురు, శుక్ర, శని, ఆదివారాలు; సూచనలు: దక్షిణామూర్తిని ఆరాధించడం,అనాథలను ఆదుకోవడం, కుక్కలకు అన్నం పెట్టడం,ఆలయాలు, చర్చిలు, మసీదులు వంటి ప్రార్థనా స్థలాలలో భోజన సదుపాయాలు ఏర్పాటు చేయించడం వల్ల మరిన్ని మంచి ఫలితాలు అందుకోవచ్చు.
- డాక్టర్ మహమ్మద్ దావూద్