ఇరు రాష్ట్రాల్లో వరంగల్ టాప్
స్వచ్ఛ భారత్లో పట్టణాలకు ర్యాంకుల కేటాయింపు
న్యూఢిల్లీ: స్వచ్ఛ భారత్లో ఇరు రాష్ట్రాల్లో వరంగల్ మొదటి స్థానంలో నిలిచింది. దేశవ్యాప్తంగా లక్షకు పైగా జనాభా ఉన్న 476 పట్టణాలు, నగరాల్లో వ్యర్థాల తరలింపు ఆధారంగా కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ర్యాంకులు కేటాయించింది. మొదటి 100 స్థానాల్లో 5 తెలుగు పట్టణాలు, నగరాలు మాత్రమే ఉన్నాయి. దేశవ్యాప్తంగా వరంగల్ 33వ స్థానంలో నిలిచింది. నిజామాబాద్ 82, హైదరాబాద్ 275వ స్థానానికి పరిమితమయ్యాయి. కాగా, ఏపీలోని విజయనగరం 58 స్థానంలో, నర్సరావుపేట 59, గుంటూరు 70వ స్థానంలో నిలిచాయి.
తెలంగాణ నగరాలు: వరంగల్ (33), నిజామాబాద్ (82), రామగుండం (142), మిర్యాలగూడ (169), సికింద్రాబాద్ (191), మహబూబ్నగర్ (230), కరీంనగర్ (259), గ్రేటర్ హైదరాబాద్ (275), సూర్యాపేట (283), ఖమ్మం (308), ఆదిలాబాద్ (349).
ఏపీ నగరాలు: విజయనగరం (58), నర్సరావుపేట (59), గుంటూరు (70), తిరుపతి (137), ఆదోనీ (148),, నెల్లూరు (156), శ్రీకాకుళం (157), తెనాలి (166), అనంతపురం (181), చిలకలూరిపేట (187), ప్రొద్దుటూరు (198), మదనపల్లి (200), వైజాగ్ (205), కడప (211), ధర్మవరం (224), రాజమండ్రి (228), తాడిపత్రి (239), ఏలూరు (249), విజయవాడ (266, కాకినాడ (300), మచిలీపట్నం (301), గుంతకల్లు (322), కర్నూలు (330), భీమవరం (342), తాడేపల్లి గూడెం (352), నంద్యాల (354), ఒంగోలు (357), చిత్తూరు (367), గుడివాడ (450), హిందూపురం (457).