భారత్ ర్యాంక్ 163
న్యూఢిల్లీ: గత వారం దక్షిణాసియా కప్ ఫుట్‌బాల్ టోర్నమెంట్ టైటిల్ సాధించిన భారత జట్టు ప్రపంచ ర్యాంకింగ్స్‌లో మూడు స్థానాలను మెరుగు పర్చుకుంది. తాజా ర్యాంకింగ్స్‌లో భారత్ 166వ స్థానం నుంచి 163వ స్థానానికి చేరుకుంది. ఆసియా ర్యాంకింగ్స్‌లో భారత్ 31వ స్థానంలో ఉంది. బెల్జియం నంబర్‌వన్ ర్యాంక్‌లో కొనసాగుతుండగా... అర్జెంటీనా రెండో స్థానం లో, స్పెయిన్ మూడో స్థానంలో ఉన్నాయి.