అల్లుణ్ని కాపాడబోయి అనంతలోకాలకు..
కొత్తగూడెం: ఖమ్మం జిల్లా కొత్తగూడెం మండలం గొల్లగూడెం గ్రామంలో ఆదివారం విషాదం చోటు చేసుకుంది. వాగులోకి స్నానానికి దిగిన బాలుడు, బాలుణ్ని కాపాడబోయిన మేనమామ ప్రమాదవశాత్తూ చనిపోయారు. వివరాలు.. గొల్లగూడెం గ్రామ సమీపంలోని వాగు వద్ద నున్న ముత్యాలమ్మ గుడికి రాపాల వెంకన్న కుటుంబం ఇంటిల్లిపాది వెళ్లి ఫంక్షన్ చేసుకుంటున్నారు.
సంతోష్ (12) అనే బాలుడు స్నానానికి దిగిన సమయంలో వాగులో సుడిగుండం ఏర్పడింది. సుడిగుండంలో చిక్కుకున్న సంతోష్‌ను కాపాడబోయిన మేనమామ రాపాల వెంకన్న (45) కూడా ప్రమాదవశాత్తూ మునిగి చనిపోయాడు. స్థానికులు శవాలను బయటికి తీశారు. పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.