Rashid Basha
-
చిన్నారుల ఆశయం
సమాజం మానవతా విలువలను మరచిపోతోంది. ఆరుగురు చిన్నారులు ఆ విలువలను ఏ విధంగా కాపాడారు? అనే కథాంశంతో రూపొందిన చిత్రం ‘లిటిల్ స్టార్స్’. రషీద్ బాషా దర్శకత్వంలో మాస్టర్ మహమ్మద్ అఫ్పాన్స్ సమర్పణలో హెచ్.డి. విజన్ ఇండియా, అనంతపురం ఫిల్మ్ సొసైటీ సంయు క్తంగా నిర్మించిన చిత్రం ఇది. పాటలను డిసెంబర్ మొదటి వారంలో విడుదల చేయనున్నారు. ‘‘పిల్లల్లో మేధాశక్తి పెంపొందించడానికి పర్యవేక్షణతో కూడిన స్వేచ్ఛ ఇవ్వాలి. అప్పుడే వాళ్లు అద్భుతాలు సాధించగలరనే సందేశాన్ని ఈ చిత్రంతో చెబుతున్నాం’’ అని నిర్మాత అన్నారు. -
పిల్లలు కాదు... పిడుగులు
నేటి బాలలే...రేపటి పౌరులు. ఈ అంశాన్నే నేపథ్యంగా తీసుకుని చేసిన చిత్రం ‘లిటిల్ స్టార్స్’. రిషి ప్రధాన పాత్రలో రషీద్ బాషా దర్శకత్వంలో ఎస్. ఇబ్రహీమ్ నిర్మించిన ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. ‘‘మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ గారి స్ఫూర్తితో ఈ చిత్రాన్ని నిర్మించాం. ఆరుగురు పిల్లలు పిడుగులై, అసాధ్యాన్ని సుసాధ్యం ఎలా చేశారన్నదే ఈ సినిమా ఇతివృత్తం’’ అని దర్శక, నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా:కిషన్సాగర్, సంగీతం: శ్రీ వెంకట్.