ratna giri
-
రత్నగిరిపై వరలక్ష్మీ వ్రత శోభ
అన్నవరం, న్యూస్‌లైన్ : రత్నగిరిపై శ్రీసత్యదేవుని సన్నిధిలో శ్రావణ మాసం రెండో శుక్రవారం, వరలక్ష్మీ వ్రతం పర్వదినం నాడు సామూహిక వరలక్ష్మి పూజ ఘనంగా నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి విచ్చేసిన 900 మంది మహిళలు భక్తి శ్రద్ధలతో ఈ పూజ అచరించారు. స్వామివారి నిత్యకల్యాణమండపంలో సామూహిక వరలక్ష్మి పూజ నిర్వహించారు. ఉదయం 9.30 గంటలకు దేవస్థానం ఈఓ పి. వేంకటేశ్వర్లు దీపారాధన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. తొలుత పండితులు విఘ్నేశ్వరపూజ నిర్వహించారు. అనంతరం సత్యదేవుడు, అమ్మవారికి పూజలు చేశారు. వేదపండితుల వేదస్వస్తితో వరలక్ష్మీ పూజ ప్రారంభమైంది. వరలక్ష్మీ అమ్మవారికి పండితులు శాస్త్రోక్తంగా అష్టోత్తర పూజ చేశారు. పూజలో పాల్గొన్న మహిళలతో కూడా పూజ చేయించి వ్రతకథను చదివి వినిపించారు. చివరలో వరలక్ష్మీ అమ్మవారికి , సత్యదేవుడు, అమ్మవార్లకు నీరాజనమంత్రపుష్పాలు సమర్పించారు. దేవస్థానం వేదపండితులు ముష్టి కామశాస్త్రి, గొర్తి సుభ్రహ్మణ్య ఘనాపాటీ, అర్చకులు ఇంద్రగంటి బుల్లి, కోట శ్రీనువాస్, వ్రతపురోహిత ప్రముఖులు ముత్య సత్యనారాయణ, తదితరులు ఈకార్యక్రమాలను నిర్వహించారు. ఈ పూజలో పాల్గొన్న మహిళలు కొబ్బరికాయ, అరిటిపళ్లు, పూవులు మాత్రం తెచ్చుకోగా, పసుపు, కుంకుమ, హారతికర్పూరం, అగరువత్తులు, గావంచా, పత్రి, అక్షింతలు, తమలపాకులు దేవస్థానమే సమకూర్చింది. వరలక్ష్మి రాగి రూపు, జాకెట్టుముక్క, తోరం, సత్యదేవుని ప్రసాదం 100 గ్రాముల ప్యాకెట్ వారికి అందచేశారు. పూజ అనంతరం మహిళలందరూ సత్యదేవుని దర్శనం చేసుకున్నారు. వీరికి అన్నదానపథకంలో ఉచిత భోజనం ఏర్పాటు చేశారు. దేవస్థానం ఏసీ ఈరంకి జగన్నాథరావు, సూపపరింటెండెంట్ నరసింహారావు, ఆలయ సిబ్బంది ఏర్పాట్లు పర్యవేక్షించారు. -
పల్లెల్లోనూ బహుళ అంతస్తులు!
సాక్షి, ముంబై: సింధుదుర్గ్, రత్నగిరి జిల్లాలు మినహా రాష్ట్రవ్యాప్తంగా గృహనిర్మాణాలపై ఒకే విధమైన చట్టం అమలు చేసేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. దీంతో గ్రామీణ ప్రాంతా ల్లో కూడా 12 అంతస్తుల భవనాలు నిర్మించేం దుకు మార్గం సుగమమైంది. అదేవిధంగా కార్పొరేషన్ హద్దు బయట కూడా ఒకటిన్నర వరకు ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ (ఎఫ్ఎస్ఐ) లభిం చే అవకాశాలున్నాయి. దీంతో నగరం బయట కూడా ఎక్కువ ఇళ్లు లభించనున్నాయి. దీని ద్వారా ఆకాశాన్నంటిన ఇళ్ల ధరలు అదుపులోకి వస్తాయి. ఈ నియమాలకు సంబంధించిన ప్రతిపాదన గత ఏడాదిన్నర నుంచి పెండిం గులో ఉంది. ప్రస్తుతం కార్పొరేషన్ పరిధిలో, కార్పొరేషన్ హద్దు నుంచి 10 కి.మీ. దూరం వరకు 12 అంతస్తుల భవనాలు నిర్మించేందు కు అనుమతి ఉంది. 10 కి.మీ. దూరం తర్వాత నిర్మాణ పనులపై ఆంక్షలు ఉండేవి. ఇకనుంచి చట్టంలో మార్పులు చేయడం వల్ల మున్సిపాలిటీల హద్దులో కూడా 12, ఆపై అంతస్తుల భవనాలు నిర్మించేందుకు మార్గం సుగమమైం ది. ఇదివరకు కార్పొరేషన్లో కూడా నియమా లు వేర్వేరుగా ఉండేవి. ఇక నుంచి సింధుదుర్గ్, రత్నగిరి రెండు జిల్లాలు మినహా రాష్ట్రవ్యాప్తంగా ఒకే విధంగా నియమాలు అమలులోకి వచ్చాయి. మున్సిపాలిటీ, గ్రామీణ ప్రాంతాల్లో కేవలం నాలుగు అంతస్తుల భవనాలు నిర్మించేందుకు అనుమతి మాత్రమే ఉండేది. ఇకనుంచి గ్రామీణ ప్రాంతాల్లో 12 అంతస్తుల భవనాలు నిర్మించేందుకు అనుమతి లభించనుంది. అందుకు అగ్నిమాపక శాఖ నుంచి నో అబ్జక్షన్ సర్టిఫికెట్ (ఎన్ఓసీ) తప్పనిసరి తీసుకోవాల్సి ఉంటుంది. ఒకటిన్నర వరకు ఎఫ్ఎస్ఐ లభించడంతో ప్రీమియం భరిస్తే కొత్తగా నిర్మించే అపార్టుమెంట్లలో ఇక నుంచి బాల్కని, మెట్లు, టెర్రెస్ లభించనున్నాయి. కాగా సింధుదుర్గ్, రత్నగిరి జిల్లాలు పర్యావరణ దృష్ట్యా అత్యంత సమస్మాత్మకంగా ఉండడంవల్ల ఇక్కడ కొత్త నియమాలు అమలుచేయలేదని అధికారులు వెల్లడించారు.