రేషన్ డీలర్ల కమీషన్ పెంచుతాం..
విజయవాడ:
కొత్తగా రేషన్ కార్డుల కోసం 6లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారని మంత్రి పరిటాల సునీత తెలిపారు. పల్స్ సర్వేలో సమస్యలున్నాయని, వాటిని అధిగమిస్తామన్నారు. పల్స్ సర్వే తర్వాత రేషన్ కార్డుల మంజూరు పై నిర్ణయం తీసుకుంటామని సునీత వెల్లడించారు.
రేషన్ డీలర్ల కమీషన్ పెంచుతామని హామీ ఇచ్చారు. నగదు రహిత రేషన్ పంపిణీ విధానంపై అధ్యయనం చేస్తున్నట్టు మంత్రి తెలిపారు. ప్రతి నెలా 15వ తేదీ వరకు రేషన్ అందిస్తామన్నారు.