‘మీలో ఎవరు కోటీశ్వరుడు’లో గెలిచినదంతా..
ఎల్లారెడ్డి: ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’లో గెలుచుకున్న రూ.25 లక్షల్లోని రూ. 20 లక్షలను స్వచ్ఛంద సంస్థలపై ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు నిజామాబాద్ జిల్లాకు చెందిన రావణ శర్మ. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా నుంచి కొన్నేళ్ల క్రితం వచ్చిన శర్మ ఎల్లారెడ్డి మండలం లింగారెడ్డిలో స్థిరపడ్డారు. శర్మ రిటైరయ్యాక పింఛన్‌గా వచ్చిన డబ్బులు అప్పులకు, గృహావసరాలకు ఖర్చుకాగా.. అయినవారు ఆదరించకపోవడంతో స్నేహితుల సహకారంతో ఇక్కడికి వచ్చి ఒంటరిగా జీవితాన్ని వెళ్లదీస్తున్నారు.
తన ప్రతిభతో మా టీవీ ప్రసారం చేస్తున్న రియాల్టీ షోలో గతనెల 18న రూ.25 లక్షలను గెలుచుకున్నారు శర్మ. వచ్చిన మొత్తం నుంచి రూ. 10 లక్షలు హైదరాబాద్‌కు చెందిన నేషనల్ అసోసియేషన్ ఫర్ బ్లైండ్ సంస్థ , మరో రూ. 10 లక్షలు శ్రీ విద్యా సెంటర్ ఫర్ మెంటల్లీ రిటార్డెడ్ పర్సన్స్ సంస్థపై డిపాజిట్ చేశారు. ఆయన బతికున్నంత వరకు బ్యాంకు వడ్డీ వస్తుంది. ఆయన మరణానంతర అసలు, వడ్డీ స్వచ్ఛంద సంస్థలకు వెళ్తుంది. వీటితోపాటు తాను కష్టాల్లో ఉన్న నాడు తనను మనిషిగా గుర్తించి సహాయం చేసిన ఒక మాతృమూర్తి పేరిట రూ. 5 లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు.