ravela
-
రెసిడెన్షియల్ కాలేజీలుగా ఎస్సీ, ఎస్టీ హాస్టల్స్
ఏలూరు రూరల్ : రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ వసతిగృహాలను రెసిడెన్షియల్ కళాశాలలుగా మార్పు చేస్తామని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి రావెల కిషోర్‌బాబు అన్నారు. శుక్రవారం ఏలూరు ఇండోర్ స్టేడియంలో జరిగిన చంద్రన్న దళితవాడ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ భవిష్యత్‌లో రూ.12 వేల కోట్లతో ఎస్సీ, ఎస్టీ ప్రాంతాలను అభివృద్ధి చేస్తామన్నారు. రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి పీతల సుజాత మాట్లాడుతూ కోట్ల రూపాయలతో ఎస్సీ వాడల్లో రోడ్లను సీసీ రహదారులుగా అభివృద్ధి చేస్తున్నామని వివరించారు. డీఆర్డీవో ద్వారా రూ. 6.75 కోట్లు, మెప్మా ద్వారా రూ. 5 కోట్ల విలువైన రుణాలను లబ్ధిదారులకు అందజేశారు. డుమ్మా కొట్టిన ప్రజాప్రతినిధులు మంత్రి సభకు స్థానిక ప్రజాప్రతినిధులు డుమ్మా కొట్టారు. సభ ప్రాంగణానికి మంత్రి రావెల వచ్చి గంటల పాటు వేచి చూసినప్పటికీ ఎంపీ మాగంటి బాబు, ఏలూరు, దెందులూరు ఎమ్మెల్యేలు బడేటి బుజ్జి, చింతమనేని ప్రభాకర్ రాలేదు. దీంతో ఆయన మంత్రి సుజాతతో కలిసి సభను అయ్యిందనిపించారు. ఎమ్మెల్సీ రాముసూర్యారావు, ఎమ్మెల్యేలు గన్ని వీరాంజనేయులు, వేటుకూరి శివరామరాజు, కలెక్టర్ కాటంనేని భాస్కర్, నగర మేయర్ షేక్ నూర్జ్జహాన్ తదితరులు పాల్గొన్నారు. -
టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో ఘర్షణ
ఒంగోలులో జరిగిన టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో ఘర్షణ చోటుచేసుకుంది. మీటింగ్ ముగిసిన తర్వాత బయటకు వెళ్తున్న మంత్రి రావెలకు వినతి పత్రం ఇచ్చేందుకు చీరాల టీడీపీ నేత పోతుల సునీత వర్గీయులు ప్రయత్నించారు. అయితే ఆయన తర్వాత చూద్దాం అంటూ దాటవేశాడు. దీంతో పోతుల వర్గీయులు మంత్రి కారును అడ్డుకునే ప్రయత్నం చేయడంతో రావెల అనుచరులు వారిపై దాడి చేశారు. ఈ ఘటనతో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన వారిని ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. ఈ ఘటనతో పోతుల వర్గీయులు మంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రోడ్డుపై బైఠాయించి రాస్తారోకోకు దిగారు. -
'సుశీల్ కుమార్‌ను వెంటనే అరెస్టు చేయాలి'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్ బాబు కొడుకు సుశీల్ కుమార్ ఓ మహిళ పట్ల అనుచితంగా ప్రవర్తించిన ఘటనపై తెలంగాణ మైనార్టీ కమిషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దోషులు ఎంతటివారైనా వదిలిపెట్టకూడదని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మైనార్టీ కమిషన్ చైర్మన్ పోలీసులను కోరారు. ఈ కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలని బంజారాహిల్స్ కార్పొరేటర్, ఎంపీ కేకే కూతురు గద్వాల విజయలక్ష్మి పోలీసులను కోరారు. బాధితురాలికి న్యాయం జరిగేవరకు పోరాడుతానని ఆమె స్పష్టం చేశారు. నిందితున్ని అరెస్టు చేసేంతవరకు ఊరుకునేది లేదని ఆమె 'సాక్షి'తో మాట్లాడుతూ తెలిపారు. గుంటూరులోనూ నిరసనలు! పత్తిపాడు: మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన మంత్రి కుమారుడిని వెంటనే అరెస్ట్ చేయాలని కోరుతూ గుంటూరు జిల్లాలో ప్రజాసంఘాలు ఆందోళనకు దిగాయి. మంత్రి కొడుకైతే అతనికి ఏమైనా కొమ్ములు ఉంటాయా.. రాజ్యాంగానికి అతీతుడా అని నినాదాలు చేస్తూ.. మైనార్టీ సంఘాల నాయకులు రాస్తారోకో చేస్తున్నారు. ప్రత్తిపాడులోని ఓల్డ్ మద్రాస్‌రోడ్డుపై ఆందోళనకారులు బైఠాయించడంతో పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. పాఠశాల నుంచి వస్తున్న ఉపాధ్యాయురాలి చేయి పట్టుకొని లాగిన వ్యక్తిపై కేసు పెట్టకుండా అతనికి సాయం చేసిన డ్రైవర్‌పై కేసు పెట్టి పోలీసులు చేతులు దులుపుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. -
ఏపీ మంత్రి రావెలకు చేదు అనుభవం!