Ravindratez
-
నిజమైన ప్రేమ
ప్రేమ గొప్పదా? స్నేహం గొప్పదా? అనే అంశాలను చర్చిస్తూ రూపొందిన తెలుగు, కన్నడ సినిమా ‘2 ఫ్రెండ్స్’. ట్రూ లవ్... ఉపశీర్షిక. సూరజ్ హీరోగా జి.ఎల్.బి. శ్రీనివాస్ దర్శకత్వంలో మళ్ళగూరు అనంతరాముడు, మళ్ళగూరు రమేశ్‌నాయుడు నిర్మించిన ఈ సినిమా చిత్రీకరణతో పాటు డబ్బింగ్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ప్రస్తుతం రీ–రికార్డింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘ప్రేమ, స్నేహం, వినోదంతో రూపొందిన మంచి సందేశాత్మక చిత్రమిది. ఇప్పటి యువత ఎన్నో అద్భుతాలు సృష్టిస్తోంది. కాలేజీ రోజుల్లోనే యువత భవిష్యత్తు నిర్ణయించబడుతుంది. అటువంటి సమయంలో వారు ప్రేమ, స్నేహం అంశాలను ఎలా చూస్తున్నారనేది సినిమా’’ అన్నారు. రవీంద్రతేజ, సానియా, స్నిగ్ధ, కార్తీక్, సారా, ధనరాజ్, కోట శ్రీనివాసరావు, జయప్రకాశ్‌రెడ్డి, వై. విజయ, శ్రీలక్ష్మీ తదితరులు నటించిన ఈ చిత్రానికి కథ, మాటలు, సంగీతం: పోలూర్ ఘటికాచలం. -
సినిమా రంగ పరిస్థితులపై..
రవీంద్రతేజ్, అక్షర జంటగా ఎల్వీ మూవీ మేకర్స్ పతాకంపై వి. క్రాంతి కుమార్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న ‘రంగుల కల’ సోమవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. తొలి సన్నివేశానికి సిద్ధేశ్వర పీఠం స్వామి విశ్వదానంద కెమెరా స్విచ్చాన్ చేయగా, ఎం. రాజ్‌కుమార్ క్లాప్ ఇచ్చారు. దర్శక–నిర్మాత వి. క్రాంతి కుమార్ మాట్లాడుతూ – ‘‘చిత్ర పరిశ్రమలోని పరిస్థితులను తెలియజేసే చిత్రమిది. వరూధిని అనే హీరోయిన్ను ఓ పల్లెటూరులో రైతు కొడుకు ఇష్టపడతాడు. ఆమెను కలుసుకుని, తన ప్రేమను ఎలా దక్కించుకున్నాడన్నదే కథ. హైదరాబాద్, అమరావతి, కర్ణాటకల్లో షూటింగ్ చేస్తాం. ఈ సినిమా కోసం రాజ్‌కుమార్‌గారు మంచి సహకారం అందిస్తున్నారు’’ అన్నారు.