Rayala-Telangana
-
డిపోలకే పరిమితమైన ఆర్టీసి బస్సులు
-
రాయల కే రైటు
-
రాయల తెలంగాణఎవరడిగారు?
నల్లగొండ అర్బన్, న్యూస్‌లైన్: ఏ ప్రజలు కోరుతున్నారని కేంద్రం రాయల తెలంగాణ విషయాన్ని అనధికారికంగా బయటకు తెస్తుందని టీఆర్ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు డాక్టర్ చెరుకు సుధాకర్ ప్రశ్నించారు. స్థానిక క్లాక్‌టవర్ సెంటర్ వద్ద సోమవారం రాత్రి జరిగిన శ్రీకాంతాచారి 4వ వర్ధంతి సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రజ ల ఆకాంక్ష మేరకు 10జిల్లాల తెలంగాణను ప్రకటించాలని డిమాండ్ చేశారు. అందుకు విరుద్ధంగా చేసే ఏ ప్రయత్నాన్నయినా ప్రజ లు అంగీకరించరని, మరో ఉద్యమానికి సిద్ధం కాగలరని హెచ్చరించారు. రాష్ట్రాలను విడదీయడం అవయవ సౌష్టంలా ఉండదని ఏ రాష్ట్రంలోనూ ఆ మాదిరిగా జరగలేదన్నారు. రాయలసీమ, తెలంగాణ అస్తిత్వాలకు భంగం కలిగేలా ఉభయులకు అంగీ కారం కాని వ్యర్థ ప్రయత్నాలను విరమించుకోవాలన్నారు. తెలంగాణకు ఫ్యాక్షనిస్టుల జాడ్యం అవసరం లేదన్నారు. శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక తెలంగాణలో ఏదైనా ఒక జిల్లాకు శ్రీకాంతాచారి పేరు పెట్టాలని విజ్ఞప్తి చేశారు. అతడి జయంతి ఆగస్టు 15న, వర్ధంతి డిసెంబరు 3ను ప్రభుత్వపరంగా నిర్వహించాలని కోరారు. క్లాక్‌టవర్ సెంటర్ వద్దకు వచ్చి నివాళులర్పించే నాయకులెవ్వరికీ పక్కనే ఉన్న శ్రీకాంతాచారి విగ్రహానికి దండవేయాలని గుర్తుకు రాకపోవడం విచారకరమన్నారు. తెలంగాణ జాగృతి సంస్థ జిల్లా కన్వీనర్ బోనగిరి దేవేందర్, బీడీఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు పందుల సైదులు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో తెలంగాణ జేఏసీ జిల్లా చైర్మన్ జి.వెంకటేశ్వర్లు, కన్వీనర్ గోలి అమరేందర్‌రెడ్డి, సీపీఐ జిల్లా కార్యదర్శి ఆదిరెడ్డి, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు నరేందర్‌రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్, శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ, కె.పర్వతాలు, పి.వెంకటేశ్వరమూర్తి, డీటీఎఫ్ నేత సోమ య్య, జమాల్‌ఖాద్రి, పన్నాల గోపాల్‌రెడ్డి, పున్న కైలాష్ పాల్గొన్నారు. అంతకుముందు వేదిక నుండి కొవ్వొత్తులతో శ్రీకాంతాచారి విగ్రహంవరకు ప్రదర్శన నిర్వహించారు. పూలమాలలు వేసి నివాళులర్పించారు. -
రాయల-తెలంగాణ
-
రాయలకు ఒప్పుకోం
వర్గల్, న్యూస్‌లైన్: హైదరాబాద్‌తో కూడిన పది జిల్లాల తెలంగాణే కావాలని, రాయల తెలంగాణకు ఒప్పుకోబోమని మాజీ మంత్రి, టీఆర్ఎస్ పొలిట్ బ్యూరో సభ్యుడు నాయిని నర్సింహారెడ్డి అన్నారు. ఆదివారం గౌరారంలో జరిగిన వర్గల్, ములుగు మండలాల టీఆర్ఎస్ కార్యకర్తల శిక్షణ శిబిరంలో పాల్గొని ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణపై కిరికిరి పెడితే మరో పోరాటానికైనా సిద్ధమని అన్నారు. తెలంగాణ కోసం అసెంబ్లీలో నోరు మెదపని, రాజీనామాలతో పదవీ త్యాగం చేయాలంటే పారిపోయినవారు తెలంగాణ పేరిట సంబరాలు జరుపుకోవడం సిగ్గుచేటని నాయిని ధ్వజమెత్తారు. మద్రాస్ రాష్ట్రంలో తమకు అటెండర్ పోస్ట్ విషయంలో అన్యాయం జరిగిందని ప్రత్యేక రాష్ట్రం కోరిన సీమాంధ్రులు తెలంగాణ ప్రాంతంలో రెండు లక్షల ఉద్యోగాలను అనుభావిస్తున్నారని అన్నారు. అందుకోసమే తాము ప్రత్యేక రాష్ట్రం కోసం డిమాండ్ చేస్తున్నట్లు స్పష్టం చేశారు. చంద్రబాబుకు ప్రేమ, అనురాగాల ప్రాధాన్యత తెలియదని, సీఎం పదవి కోసం పిల్ల నిచ్చిన మామ ఎన్టీఆర్కే వెన్నుపోటు పొడిచిన ఘనుడని ఎదేవా చేశారు. టీఆర్ఎస్ చేపట్టిన ఉద్యమాలతోనే తెలంగాణ ఆవిర్భావం జరుగనుందన్నారు. హైదరాబాద్, భద్రాచలంతో కూడిన పది జిల్లాల తెలంగాణే మాలక్ష్యమని అన్నారు. కార్యక్రమంలో కవి గాయకుడు దేశపతి శ్రీనివాస్, నియోజకవర్గ ఇన్చార్జి భూంరెడ్డి, పార్టీ రాష్ట్ర నాయకులు సరేష్‌గౌడ్, ఎలక్షన్ రెడ్డి, టీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్, పార్టీ మండల అధ్యక్షుడు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
మరోసారి తెరమీదకు రాయల తెలంగాణ
-
ఢిల్లీలో చురుగ్గా విభజన ప్రక్రియ
-
మరో వి‘భజన’
సాక్షి ప్రతినిధి, కర్నూలు:తెలంగాణ రాష్ట్ర ప్రకటన వెలువడిన నాటి నుంచి జనం సమైక్యాంధ్ర కోసం ఉద్యమబాట పట్టగా... ఆ ఉద్యమస్ఫూర్తిని నీరుగార్చే ప్రయత్నాల్లో కాంగ్రెస్ జిల్లా నేతలు నిమగ్నమయ్యారు. రాష్ట్ర విభజన నిర్ణయానికి ముందు నుంచే రాయల తెలంగాణ, గ్రేటర్ రాయలసీమ అంటూ అధిష్టానం ముందు కూడా భిన్న వాదనలు వినిపించిన జిల్లా కాంగ్రెస్ నేతలు ఉద్యమం ఉద్ధృతంగా సాగుతున్న తరుణంలోనూ తమ రాజకీయ కుట్రలను మానుకోవడం లేదు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ఆగదని, ఈ పరిస్థితుల్లో తెలంగాణతో కలిసి ఉండటమొక్కటే మార్గమంటూ మరో విభజనను తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఆంటోని కమిటీ ముందు అనంతపురం జిల్లా నేతలు జేసీ దివాకర్ రెడ్డి, మధుసూదన్ గుప్తా బాహాటంగానే తెలంగాణలో కర్నూలు, అనంతపురం జిల్లాలను కలపాలని కోరగా, జిల్లాకు చెందిన నేతలు మాత్రం పైకి సమైక్యాంధ్ర అంటూ లోపాయికారీగా రాయల తెలంగాణకు కూడా సిద్ధమేనంటూ తమ వంతు ప్రయత్నాలు సాగిస్తున్నట్లు సమాచారం. రోజుకో మాట: మంగళవారం ఆంటోని కమిటీ ముందు రాష్ట్రాన్ని విభజిస్తే రాయలసీమకు రాళ్లే మిగులుతాయని చెప్పిన న్యాయశాఖ మంత్రి ఏరాసు ప్రతాప్‌రెడ్డి తెలంగాణ ప్రకటన వెలువడినప్పటి నుంచి విభిన్న వాదనలు వినిపిస్తున్నా రు. ఆయనతో పాటు కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి ప్రకటన వెలువడిన తర్వాత ‘ఉంటే సమైక్యంగా ఉంచండి... లేదంటే మూడు ముక్కలు చేయండి’ అని అధిష్టానానికి తేల్చిచెప్పారు. జిల్లాలో విలేకరుల సమావేశాల్లోనూ ఇదే మాట చెప్పుకొచ్చారు. తెలంగాణ ఒక్క రాష్ట్రాన్నే ఇవ్వాలని కేంద్రం భావిస్తే అనంతపురం, కర్నూలు జిల్లాలను తెలంగాణలో కలపాలనే వాదన కూడా తీసుకొచ్చారు. దీనిపై విమర్శలు వెల్లువెత్తడంతో బహిరంగంగా సమైక్య మాటలు చెబుతూ ఢిల్లీలో రాయల తెలంగాణకు లాబీయింగ్ చేస్తున్నారు. కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి రాష్ట్ర విభజన ప్రకటన వెలువడిన రోజు నుంచి ఢిల్లీకే పరిమితమై తనకున్న పెద్దల సంబంధాలతో ఈ మేరకు పావులు కదుపుతున్నట్లు సమాచారం. రాయల తెలంగాణ ప్రకటన వెలువడిన తర్వాతే ఆయన కర్నూలుకు వస్తారని సన్నిహితులు చెబుతున్నారు. మీటింగ్ సాకుతో దేశం విడిచిన టీజీ తెలంగాణ రాష్ట్ర ప్రకటన వెలువడిన నాటి నుంచి భవిష్యత్ వ్యూహంపై మల్లగుల్లాలు పడుతున్న చిన్ననీటి పారుదల శాఖ మంత్రి టి.జి.వెంకటేశ్ ప్రస్తుత పరిస్థితుల నుంచి కొంత ఉపశమనం పొందేందుకు ఏకంగా దేశాన్నే వదిలి పెట్టారు. ఓ సమావేశంలో పాల్గొనే నెపంతో ఆయన బుధవారం అమెరికా పయనమయ్యారు. వచ్చే నెల 5వ తేదీ వరకు అక్కడే ఉంటారు. కర్నూలు జిల్లాకు అన్యాయం చేసే విధంగా 72 జీవో జారీతో పాటు గుండ్రేవుల బ్యారేజీకి మోకాలడ్డుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల నేపథ్యంలో ఆయన జిల్లా వాసుల నుంచి విమర్శలు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి భారీ నీటిపారుదల శాఖ మంత్రి సుదర్శన్‌రెడ్డిపై విమర్శలు చేశారు. ఈ రెండు నిర్ణయాలపై తనకు స్పష్టమైన వివరణ ఇవ్వలేదని ముఖ్యమంత్రిని కూడా ఆయన తప్పు పట్టారు. ఇందులో భాగంగా సీమాంధ్ర ఎమ్మెల్యేల సమావేశానికి హాజరుకాని ఆయన మంగళవారం నాటి ఆంటోని కమిటీ ముందుకు కూడా వెళ్లలేదు. సమైక్యాంధ్ర ఉద్యమం తీవ్రరూపం దాలుస్తున్న నేపథ్యంలో ఆయన అమెరికా వెళ్లిపోవడం గమనార్హం. మొత్తంగా జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉద్యమం పట్ల అంటీ ముంటనట్లుగా వ్యవహరిస్తుండటం పట్ల సమైక్యవాదుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. వారిని ఎక్కడిక క్కడ నిలదీసేందుకు సిద్ధమవుతున్నారు.