RBI officials
-
3.7 ట్రిలియన్ల ఎకానమీగా భారత్: ఆర్బీఐ
ముంబై: భారత్ 2023లో 3.7 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆర్టికల్ ఒకటి అభిప్రాయపడింది. ప్రపంచంలోని ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా బ్రిటన్‌పై ఆధిక్యాన్ని కొనసాగిస్తుందని ఆర్బీఐ ప్రచురించిన జనవరి బులిటన్ పేర్కొంది. ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ దేబబ్రత పాత్ర నేతృత్వంలోని బృందం ఈ నివేదికను రూపొందించింది. -
తమిళ గీతాన్ని అవమానపరిచారంటూ ఆర్బీఐ సిబ్బందిపై కేసు నమోదు
చెన్నై: మన దేశంలోనే తమిళనాడు రాష్ట్రానికి ప్రత్యేక చరిత్ర ఉంది. దేశంలోని ఇతర ప్రాంతాల ప్రజల కంటే.. తమిళులు చాలా భిన్నమైన వాళ్లు. సమస్య వస్తే.. అందరూ ఒకే తాటిపైకి వచ్చి సమస్యలపై పోరాటం చేస్తారు. ముఖ్యంగా తమిళనాడు పద్ధతులు, సంస్కృతుల పట్ల రాష్ట్ర ప్రజలు చాలా సీరియస్‌గా ఉంటారు. అయితే తాజాగా మరోసారి తమిళ వాసులకు కోపం వచ్చింది. బుధవారం దేశ వ్యాప్తంగా 73వ రిపబ్లిక్ వేడుకలు జరిగిన సంగతి తెలిసిందే. రిపబ్లిక్ డే వేడుకల్లో భాగంగా రాష్ట్రీయ గీతం తమిళ్‌తాయ్ వాళ్తు ఆలపిస్తారు. అచ్చం మనం జాతీయ గీతం పాడేటప్పుడు ఎలాగ నిలబడతామో... వారు కూడా అలాగే నిలబడి తమిళ గీతాన్ని ఆలపిస్తారు. కానీ నిన్న తమిళ గీతం పాడేటప్పుడు మాత్రం.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారులు లేచి నిలబడలేదు. ఈ సంఘటన తమిళ నాడు ఆర్బీఐ కార్యాలయంలో చోటు చేసుకుంది. ప్రస్తుతం ఈ సంఘటన రాష్ట్రంలో వివాదస్పదంగా మారింది. అంతేకాదు.. రాష్ట్రీయ గీతం పాడేటప్పుడు నిలబడని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారుల పై హైకోర్టు న్యాయవాది జి రాజేష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే మద్రాసు కోర్టు పిటీషన్ కూడా దాఖలు చేశారు. చదవండి: కరోనా: మరోసారి 3 లక్షలకు దిగువన కేసులు.. కొత్తగా ఎన్నంటే ఇక ఈ కేసుపై విచారణ చేసిన కోర్టు.. తమిళ గీతం పాడేటప్పుడు ఆ అధికారులు నిలబడటం ఏ మాత్రం తప్పు కాదని పేర్కొంది. వారికి ఈ రూల్స్ తేలియదని మేం అనుకుంటున్నామని, దీనిపై ఇంత రాద్ధాంతం అవసరం లేదు అంటూ తీర్పు ఇచ్చింది. అయితే అటు కోర్టు తీర్పును రాష్ట్ర ఆర్థిక మంత్రి పీటీఆర్ త్యాగరాజన్, ఐటీ శాఖ మంత్రి మనో తంగరాజ్‌లు ఖండించారు. అంతేకాదు ఆర్బీఐ కార్యాలయ ముట్టడికి తమిళ సంఘాలు పిలుపు నిచ్చాయి. దీంతో పోలీసులు ఆర్బీఐ చుట్టూ భారీగా పోలీసుల మోహరించారు. చదవండి: Uttar Pradesh Assembly Election 2022: ఏదో తేడా కొడుతోంది..! -
ఏపీతో పోటీపడేవారెవ్వరూ లేరు
-
ఏపీతో పోటీపడేవారెవ్వరూ లేరు
’అనంత’ పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు సాక్షిప్రతినిధి, అనంతపురం: ‘‘సంక్షేమంలో దేశంలోనే అగ్రస్థానంలో ఉన్నాం. రూ. 500, వెరుు్యనోట్ల రద్దుతో ఆర్థిక సమస్య తలెత్తుతోంది. అరుునప్పటికీ మనతో పోటీపడేందుకు దేశంలో మరెవ్వరూ లేరు’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబుఅన్నారు. అనంతపురం జిల్లా పెనుకొండ మండలంలో హంద్రీ-నీవా సుజల స్రవంతి పథకం రెండోదశలో భాగంగా నిర్మించిన గొల్లపల్లి రిజర్వాయర్‌కు శుక్రవారం నీరు విడుదల చేశారు. ఈ సందర్భంగా బహిరంగ సభలో సీఎం చంద్రబాబు ప్రసంగించిన తర్వాత మడకశిరలో ‘పసుపు-కుంకుమ’ కార్యక్రమంలో పాల్గొన్నారు. డిజిటల్ లావాదేవీలపై 7, 8 తేదీల్లో భేటీ డిజిటల్ లావాదేవీలపై జాతీయ స్థారుులో ఏర్పాటైన కమిటీ సమావేశం 7, 8 తేదీల్లో ఢిల్లీలో నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. శుక్రవారం విజయవాడలోని కమాండ్ కమ్యూనికేషన్ సెంటర్లో ఆయన పెద్దనోట్ల రద్దు పరిణామాలపై బ్యాంకర్లు, ఆర్బీఐ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. డిజిటల్ ఆర్థిక లావాదేవీల అమలులో ఎదురవుతున్న సవాళ్లపై సభ్యులతో సమాలోచనలు జరుపుతామని చెప్పారు. ‘నగదురహిత’కు రూ.100 కోట్లు సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పెద్ద ఎత్తున నగదు రహిత లావాదేవీలను తక్షణం అమల్లోకి తేవాలని బాబు నిర్ణరుుంచారు. ఇందులో భాగంగా నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ఖజానా నుంచి ఏకంగా రూ.100 కోట్లు వ్యయం చేయాలని నిర్ణరుుంచారు. నగదు రహిత లావాదేవీలు నిర్వహించే గ్రామాలకు ప్రోత్సాహకాలు అందించాలని నిర్ణరుుంచారు. నగదు కొరత సమస్యపై ముఖ్యమంత్రి శుక్రవారం బ్యాంకర్లు, అధికారులతో టెలికాన్ఫరెన్స నిర్వహించారు. గ్రామాల్లో నగదు రహిత లావాదేవీలను చేరుుంచేవారికి రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి డబ్బులు ఇవ్వాలని నిర్ణరుుంచారు. మరోవైపు నగదురహిత లావాదేవీల ప్రోత్సాహక పథకం పచ్చ చొక్కాలకేనని అప్పుడే విమర్శలు వినిపిస్తున్నాయి. హెచ్‌టీ లీడర్షిప్ సదస్సుకు బాబు న్యూఢిల్లీ: ఢిల్లీలో శనివారం ప్రారంభంకానున్న హెచ్‌టీ 14వ లీడర్ షిప్ సమ్మిట్‌లో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారని ఢిల్లీలోని ఏపీ ప్రభుత్వ సమాచార శాఖ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. ’భారత్‌కు కావాల్సిన మార్పులు’ థీంతో నిర్వహించే ఈ సదస్సులో బ్రిటన్ మాజీ ప్రధాని డేవిడ్ కామెరున్, కేంద్ర మంత్రులు ఆరుణ్ జైట్లీ, మనోహర్ పరీకర్, పియూష్ గోయల్, క్రికెట్ దిగ్గజం, ఎంపీ సచిన్ టెండుల్కర్, ప్రముఖ నటుడు అమితాబచ్చన్, యూపీ సీఎం అఖిలేశ్ యాదవ్, బీహార్ సీఎం నితీశ్ కుమార్ పాల్గొంటారని పేర్కొన్నారు.