14న ఆర్డీవో కార్యాలయం ముట్టడి
జగ్గంపేట :
రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయంశమైన జిల్లాలోని కోస్టల్ ప్రాంతమైన తొండంగి మండల పరిధిలో దివీస్ ఫార్మాçస్యూటికల్స్ ఏర్పాటుకు జరుగుతున్న భూసేకరణకు వ్యతిరేకంగా పోరును ఉధృతం చేసేందుకు ఆదివారం వామపక్ష పార్టీలు జగ్గంపేటలో భేటీæ అయ్యాయి. స్థానిక ట్రావెలర్స్ బంగ్లా వద్ద సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ, సీపీఐ (ఎంఎల్) జనశక్తి, సీపీఐ (ఎంఎల్) లిబరేష¯ŒS నాయకులు సమావేశమై ఉద్యమ కార్యచరణను రూపొందించారు. జనశక్తి నేత కర్నాకుల వీరాంజనేయులు అధ్యక్షత వహించగా న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఎం.దుర్గాప్రసాద్, జిల్లా నాయకుడు జె.వెంకటేశ్వర్లు, లిబరేష¯ŒS జిల్లా కార్యదర్శి కొసిరెడ్డి గణేశ్వరరావు, ఏగుపాటి అర్జునరావు, లచ్చబాబు, రైతుకూలీ సంఘ నేత రామలింగేశ్వరరావు, జనశక్తి నాయకుడు రమేష్, త్రిమూర్తులు పాల్గొన్నారు. జనశక్తి నేత కర్నాకుల మాట్లాడుతూ దివీస్ బాధితులకు అండగా ఉండేందుకు వామపక్షాలు నిర్ణయించుకున్నాయని దీనిలో భాగంగా ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఈనెల 14న పెద్దాపురం ఆర్డీఓ కార్యాలయాన్ని ముట్టడించి ఆందోళన చేపడతామన్నారు. ఆందోళనలో దివీస్ బాధిత గ్రామాల ప్రజలు పాల్గొంటారన్నారు. ఇప్పటి వరకు 400 తప్పుడు కేసులు బనాయించారని వాటిని ఎత్తివేయాలన్నారు. దివీస్ వల్ల మత్స్య సంపద హరించిపోవడమే కాకుండా మత్స్యకారులు జీవనోపాధిని కోల్పోతారన్నారు.