సభలో సీఎం, విపక్ష నేతల సంవాదం
అంత కోపంలోనూ చంద్రబాబు నోటి వెంట ఒక్క నిజమూ రాదు: జగన్
నా నీతి, నిజాయితీ వల్ల ఇన్నేళ్లుగా ఎవరూ వేలెత్తి చూపలేదు: చంద్రబాబు
సాక్షి, హైదరాబాద్: ‘‘... అదేదో ముని శాపం గురించి చెబుతారు కదా! చంద్రబాబుకూ ముని శాపం ఉన్నట్లుంది. ఒక్క నిజం నోట్లోనుంచి వచ్చినా తల వేయి వక్కలయివుతుందేమో! అంత కోపంలోనూ అ బద్ధాలు తప్ప ఒక్క నిజమూ ఆయన నోటి వెంట రాలేదు...’’ అని ప్రతి పక్ష నేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి సోమవారం శాసనసభలో సీఎం చంద్రబాబునుద్దేశించి ఎద్దేవా చేశారు. ఈ వ్యాఖ్యలపై అధికార పక్ష సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో అధికార, ప్రతిపక్షాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఆ దశలో సీఎం ఒక్కసారిగా సహనం కోల్పోయారు. ‘‘నా రాజ కీయ జీవితం మొత్తం నీతిమయం. ఎవరూ వేలె త్తి చూపలేకపోయారు. విశ్వసనీయతకు మారు పేరు టీడీపీ. మీరు సీబీఐ కేసుల్లో నిందితులు’’ అంటూ ఆవేశంతో ఊగిపోయారు. చంద్రబాబు ఆవేశం కట్టలు తెంచుకున్న ఈ సన్నివేశానికి సోమవారం శాసనసభ వేదిక అయింది. రుణమాఫీ పేరిట రైతులను రుణగ్రస్తులను చేశారంటూ కేస్ స్టడీస్తో సహా ప్రతిపక్ష నేత సభ ముందు ఉంచడంతో బాబు ఎదురుదాడికి దిగారు.
సభానేత, విపక్ష నేత మధ్య వాగ్వాదం సాగిన తీరు ఇలా...
విపక్ష నేత జగన్: కేస్ స్టడీస్ చెబుతున్నా. షరతులు, పరిమితులు, నిబంధనలతో ప్రభుత్వం రుణమాఫీ చేసిన తీరుకు మచ్చుకు కొంత మంది వివరాలు చెబుతున్నా. ప్రభుత్వం జమ చేసిన మొత్తం కంటే వడ్డీ ఎక్కువగా ఉంది.
సీఎం చంద్రబాబు: కేస్ స్టడీస్ వద్దు. రియల్ స్టడీ స్ కావాలి. నిబంధనలు, మార్గదర్శకాల మేరకు మాఫీ చేశాం. తెలివి ఎక్కువై కేస్ స్టడీస్ చెబుతున్నారు. 2008లో జరిగిన రుణ మాఫీలో అవినీతి జరిగింది. ఇప్పుడు ఎక్కడా అవినీతి లేకుండా మాఫీ చేస్తున్నాం.
జగన్: నాకు మాట్లాడే అవకాశం ఇచ్చి.. మధ్య లో సీఎం ప్రసంగించడానికి మైక్ ఇస్తే ఎలా?
స్పీకర్: మీకూ మైక్ ఇస్తాం.
సీఎం: నేను ఏటా 10 శాతం వడ్డీ ఇస్తాను. బ్యాం కుల్లో రుణాలు రీషెడ్యూలు చేసుకుంటే 4 శాత మే వడ్డీ పడుతుంది. ఇంకా 6 శాతం మిగులుతుందని కొండపిలో చెప్పాను. కేస్ స్టడీస్ కాదు. రియల్ స్టడీస్ చెప్పండి. దొంగ లెక్కలు రాయడం లో మీరు సిద్ధహస్తులు.
జగన్: సీఎంకు ముని శాపం ఉన్నట్లుంది. ఆయన నోట్లోంచి ఒక్క నిజమూ రాదు.
సీఎం: ఈయన తండ్రి కూడా ఇదే మాదిరి మాట్లాడారు. నా నీతి, నిజాయితీ వల్ల ఇన్నేళ్లుగా ఎవరూ వేలెత్తి చూపలేదు. సీబీఐ కేసుల్లో మీరు నిందితులు. వ్యవసాయం దండగన్నానని వైఎస్ రాజశేఖరరెడ్డి కూడా ప్రచారం చేశారు.
జగన్: ముఖ్యమంత్రి కళ్లు పెద్దవి చేసి మాట్లాడారు. ఆయన మాట్లాడిన తీరు చూస్తే మాకు నిజంగా భయమేసింది. (నవ్వుతూ..) ఇంతగొప్పగా.. కళ్లార్పకుండా అబద్ధాలు చెప్పారు. కేస్ స్టడీస్ అంటే రైతులు పడుతున్న తిప్పలే. అవే నేను చెబుతున్నాను.
సీఎం : నేను విధానం చెప్పాను. వాళ్లు కేస్ స్టడీస్ చెబుతున్నారు. పేరు, చిరునామా చెబితే సకల సమాచారాన్ని 5 నిమిషాల్లో చెబుతాం.
జగన్ : చెప్పినవన్నీ మీకు సమర్పిస్తాం. పరిశీలించుకోండి.
ఎన్నికలకు వెళదాం: జగన్ ప్రతి సవాల్
ఏపీలో ఆత్మహత్య చేసుకున్న 86 మంది రైతు లు.. రుణ మాఫీ అమల్లో ఉన్న సమస్యలు, లోపాలవల్లనే బలవన్మరణానికి పాల్పడ్డారని నిరూపిస్తే.. తాను ఎమ్మెల్యే పదవికి రాజీ నామా చేస్తానని, ప్రతిపక్ష నేత స్థానం నుంచి జగన్ తప్పుకుంటారా? అని ప్రభుత్వ చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు సవాలు విసిరారు. దీన్ని స్వీకరించిన విపక్ష నేత.. ‘‘నేను యావ త్ టీడీపీకి సవాల్ చేస్తున్నా. మీకు ధైర్యం ఉంటే ఎన్నికలకు వెళదాం. ఏవరేమిటో తెలుస్తుంది’’అని ప్రతిసవాల్ చేశారు.