rebbana
-
ఘనంగా కార్మిక దినోత్సవ వేడుకలు
రెబ్బెన : మండలంలోని గోలేటి, రెబ్బెన మండల కేంద్రంలో మంగళవారం కార్మిక దినోత్సవ వేడుకలను కార్మికులు, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో గోలేటి టౌన్షిప్ లోని తెలంగాణ భవన్ వద్ద టీబీజీకేఎస్ ఏరియా ఉపాధ్యక్షుడు మల్రాజు శ్రీనివాస్‌రావు ఎర్రజెండాను ఎగురవేసి కార్మిక అమరవీరులకు నివాళి అర్పించారు. స్థానిక కేఎల్ మహేంద్రభవన్ వద్ద ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి బోగే ఉపేందర్, సింగరేణి బస్టాండ్ వద్ద సీపీఐ పట్టణ కార్యదర్శి జగ్గయ్య,రమణారెడ్డి నగర్లో సీపీఐ సహాయ కార్యదర్శి కిషన్ ఆధ్వర్యంలో మేడే దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా పతాకాన్ని ఎగురవేసి అమరవీరులు నివాళులర్పించారు. గోలేటి ఎక్స్‌రోడ్ వద్ద సీపీఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు పొన్న శంకర్, రెబ్బెన మండల కేంద్రంలో మండల కార్యదర్శి రాయిల్ల నర్సయ్య జెండాలను ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఉపేందర్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్నాయని ఆరో పించారు. కార్మిక సంఘాలు పోరా టాలతో సాధించిన కార్మిక చ ట్టాలను తుంగలో తొక్కుతూ కార్మిక లోకా నికి ప్రభుత్వాలు అన్యాయం చేస్తున్నాయ ని అన్నారు. చికాగో అమరవీరుల పో రాట స్ఫూర్తితో కార్మికులంతా హక్కుల కోసం పోరాడాలని సూచించారు. కార్యక్రమాల్లో సిక్స్మె న్ కమిటీ సభ్యులు రాంరెడ్డి ,నాయకులు సాంబగౌడ్, చంద్రశేఖర్, కుమార్, ఏఐటీయూసీ నాయకులు శేషు, కిరణ్‌బాబు, సీపీఐ రెబ్బెన పట్టణ కార్యదర్శి శంకర్, నాయకులు అశోక్, దుర్గం తిరుపతి ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కా ర్యదర్శి దుర్గం రవీందర్ పాల్గొన్నారు. -
సింగరేణి కార్మికుల ధర్నా
రెబ్బన (ఆదిలాబాద్) : సమస్యల పరిష్కారం కోసం సింగరేణి కార్మికులు ఆందోళన బాట పట్టారు. ఆదిలాబాద్ జిల్లా రెబ్బన మండలం గోలేటి టౌన్షిప్లో ఉన్న సింగరేణి జీఎం కార్యాలయం ముందు మంగళవారం ధర్నా నిర్వహించారు. వారసత్వ ఉద్యోగాలను పునరుద్ధరించాలని, సకలజనుల సమ్మె కాలం నాటి వేతన బకాయిలను విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. అలాగే వీఆర్ఎస్, తొలగింపునకు గురైన కార్మికులకు తిరిగి సింగరేణిలో అవకాశాలు కల్పించాలని కోరారు. -
అప్పులబాధతో రైతు ఆత్మహత్య
రెబ్బన (ఆదిలాబాద్ జిల్లా) : అప్పులబాధతో పత్తి రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన రెబ్బన మండలం గోలేటి పంచాయతీ కైరిగూడ గ్రామంలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. అయితే ఈ విషయం ఆలస్యంగా మంగళవారం వెలుగులోకి వచ్చింది.గ్రామానికి చెందిన గుగులోత్ వసంత్ రావు(40) అనే రైతు ఈ ఏడాది 15 ఎకరాల్లో పత్తి సాగు చేశాడు. వర్షాలు లేకపోవడంతో పంట దిగుబడి ఆశించినంతగా రాలేదు. సుమారు రూ.4 లక్షల మేర అప్పయింది. అప్పులు తీర్చే మార్గం కనపడక మనస్తాపంతో పురుగుల మందు తాగాడు. కుటుంబసభ్యులు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. -
స్కార్పియో, బైక్ ఢీ: ఒకరు మృతి
రెబ్బన (ఆదిలాబాద్) : రెబ్బన మండలం తక్కళ్లపల్లి సమీపంలో ఎదురెదురుగా వస్తున్న బైక్, స్కార్పియో కారు ఢీకొన్నాయి. మంగళవారం జరిగిన ఈ ప్రమాదంలో లక్సెట్టి సాయి ప్రసాద్(18) అనే యువకుడు అక్కడికక్కడే మరణించగా.. మరో యువకుడికి తీవ్రగాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. -
రెబ్బెనలో లారీ బీభత్సం
ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లాలోని రెబ్బెనలో శనివారం ఓ లారీ బీభత్సం సృష్టించింది. అధిగ వేగంతో వస్తున్న లారీ అదుపుతప్పి పక్కనే ఉన్న షాపులపైకి దూసుకెళ్లింది. దీంతో రెండు షాపులు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. ఈ ఘటనలో రూ. 3 లక్షల ఆస్తి నష్టం వాటిల్లింది. లారీ దూసుకెళ్లిన సమయంలో షాపుల్లో ఎవరు లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని ఘటనకు కారణమైన లారీని స్వాధీనం చేసుకుని... డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.