యువతి అనుమానాస్పద మృతి
హైదరాబాద్ : ఇబ్రహీంపట్నంలోని అవేరా ఇంజినీరింగ్ కళాశాలలో చదువుతున్న స్వప్న(21) అనే యువతి అనుమానాస్పద స్థితిలో శుక్రవారం మృతి చెందింది. అయితే ఆమెకు ఆరునెలల క్రితమే వివాహమైనట్లుగా సమాచారం. ఆమె భర్త దుబాయిలోని షిప్‌యార్డులో పనిచేస్తున్నాడు. కాగా స్వప్నను అత్తింటివారే కట్నం కోసం వేధించి చంపేశారని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.
స్వప్న మృతదేహానికి ఉస్మానియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. కాగా తమకు న్యాయం చేయాలంటూ మృతురాలి కుటుంబీకులు అఫ్జల్‌గంజ్ పోలీస్‌స్టేషన్ వద్ద ఆందోళనకు దిగారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.