యూపీ ప్రజలతో రికార్డు స్థాయిలో మొబైల్స్
న్యూఢిల్లీ: గ్రామీణ ప్రాంతాల్లో 30 శాతం కుటుంబాలు ఎస్సీ, ఎస్టీలేనని సామాజిక ఆర్థిక సర్వేలో తేలింది. యూపీలో అత్యధికంగా 86.63 శాతం కుటుంబాలకు మొబైల్ ఫోన్లు ఉన్నాయని, అత్యల్పంగా ఛత్తీస్ఘఢ్ లో 28.47 శాతం కుటుంబాల వద్ద ఫోన్లు ఉన్నాయి. గ్రామాలలో ఉండే వారిలో ప్రతి ముగ్గురులో ఒకరు నిరక్ష్యరాస్యులేనని సర్వే పేర్కొంది.
నిరక్ష్యారాస్యుల జాబితాలో తొలి రెండు స్థానాలలో రాజస్థాన్ (47.58 శాతం), మధ్యప్రదేశ్ (44.19 శాతం) ఉన్నాయి. మూడు, నాలుగు స్థానాలలో బీహార్, తెలంగాణ రాష్ట్రాలు నిలిచాయి. గ్రామీణ ప్రాంతాల్లోని 75 శాతం కుటుంబాల నెలవారీ ఆదాయం రూ. 5 వేల లోపే నని అధికారుల సర్వేలో తేలింది. ఎక్కువ శాతం పారిశుద్ధ్య కార్మికులున్న రాష్ట్రంగా త్రిపుర నిలిచింది.