జకీర్ నాయక్ ప్రధాన అనుచరుడి అరెస్టు
శాంతి ప్రవచనాలు వల్లిస్తున్నాంటూ చెప్పుకొనే పీస్ టీవీ వ్యవస్థాపకుడు జకీర్ నాయక్ సన్నిహిత అనుచరుడిని మహారాష్ట్ర ఏటీఎస్, కేరళ పోలీసులు జాయింట్ ఆపరేషన్లో అరెస్టు చేశారు. అర్షిద్ ఖురేషీ అనే ఈ యువకుడికి జకీర్ నాయక్ నడిపించే ఇస్లామిక్ రీసెర్చ్ ఫౌండేషన్ (ఐఆర్ఎఫ్)తో సంబంధాలున్నాయని, అతడిని నవీ ముంబై ప్రాంతంలో అరెస్టు చేశారని తెలిసింది.
కేరళ యువకులను ఇస్లామిక్ స్టేట్లో నియమిస్తున్నాడన్న ప్రధాన ఆరోపణతో ఖురేషీని అరెస్టు చేసినట్లు జాతీయ మీడియా కథనాలను బట్టి తెలుస్తో ంది. ఖురేషి మీద ఐపీసీ సెక్షన్లు 153ఎ, 34లతో పాటు 13యూఏపీఏ కింద కేసులు పెట్టారు. ఖురేషీకి ఐఆర్ఎఫ్తో సంబంధాలు పర్తిగా బయటపడితే.. జకీర్ నాయక్ సంస్థ గుట్టు మొత్తం బయటపడుతుంది. ఖురేషీని మహారాష్ట్ర ఏటీఎస్ పోలీసులు ప్రశ్నించిన తర్వాత అతడిని కేరళకు తీసుకెళ్తారు.