ఆశ్చర్యపరిచిన బర్త్‌డే కానుక
ముంబై: బాలీవుడ్ అగ్రనటుడు షారుక్‌ఖాన్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు ఓ అద్భుతమైన కానుక వచ్చింది. ఆయన సొంత నిర్మాణ సంస్థ రెడ్ చిల్లీస్లోని వీఎఫ్ఎక్స్ బృందం షారుక్ కోసం నిలువెత్తు త్రీడీ ప్రింటెడ్ మోడల్ తీసి ఇచ్చారు.
'కానుక చూసి ఉద్వేగానికి లోనయ్యాను. నా నిర్మాణ సంస్థ అయిన రెడ్ చిల్లీస్ వీఎఫ్ఎక్స్ బృందం త్రీడీ ప్రింట్‌ని నాకు బర్త్‌డే కానుక ఇచ్చింది. 49వ పడిలోకి అడుగుపెట్టాను. ఈ కానుకకు వాడిన టెక్నాలజీ చూసి ఆశ్చర్యపోయాను. ఇలాంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని మన దేశంలో ఇంతవరకు ఎక్కడా వాడలేదు. ఇప్పటివరకు చేసుకున్న పుట్టిన రోజు వేడుకల కంటే ఇది ప్రత్యేకమైనది. ప్రస్తుతం నేను యశ్ రాజ్ సంస్థ బ్యానర్లో 'ఫ్యాన్', 'రేస్' సినిమాల్లో నటిస్తున్నాను' అని షారుక్ చెప్పుకొచ్చారు.