ఇవి రోజూ తింటే పొడవు పెరుగుతారట!
సరైన ఎత్తు పెరగాలని అందరూ కోరుకుంటారు. టీనేజీ దాటాక ఎత్తు పెరగడం ఆగిపోతుంది. వయసు దాటిపోయినప్పటికీ కొందరు ఎత్తు పెరిగేందుకు అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. ఇది అన్నిసార్లూ సరైన ఫలితాన్నివ్వకపోవచ్చు. అందుకే ఎదుగుతున్న వయసులోనే తగిన జాగ్రత్తలు పాటించడం వల్ల సరైన ఎత్తు పెరగవచ్చు. ఆహారంలో కొన్ని మార్పులు చేయడం ద్వారా ఎత్తు పెరిగే అవకాశం ఉంది. ఇందుకు దోహదపడే ఆహార పదార్థాల గురించి తెలుసుకుందాం..
1. ఎర్ర ముల్లంగి
ఎర్రముల్లంగిని తరుచూ తీసుకోవడం వలన ఎత్తు పెరుగవచ్చు. దీంట్లో ఎత్తు పెరగడానికి ఉపయోగపడే హార్మోన్లు అధికంగా ఉంటాయి.
2. బీన్స్
ఫైబర్, ప్రోటిన్లు, విటమిన్లు, పిండిపద ర్థాలు బీన్స్‌లో పుష్కలంగా ఉంటాయి. బీన్స్‌ను ఎక్కువగా తీసుకోవడం వలన ఎత్తు పెరుగవచ్చు.
3. బెండకాయ
ఎత్తు పెరగడానికి ఉపయోగపడే మరో కురగాయ బెండకాయ. దీంట్లో విటవిన్లు, ఫైబర్, పిండిపదర్థాలు, నీరు, ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి.
4. బచ్చలికూర
ఎత్తు పెరగడానికి ఉపయోగపడే అద్భుతమైన ఆకుకూర బచ్చలి. సాధరణంగా దీనిని దక్షణ ఆసియాలో వాడుతారు. ఐరన్, కాల్షియం, ఫైబర్ బచ్చలిలో అధికంగా ఉంటుంది.
5. బఠాని
బఠానిలు రోజు తీసుకోనడం వల్ల ఎత్తు పెరిగే అవకాశం ఉంటుంది. ఫైబర్, ప్రోటిన్స్, మినరల్స్ దీంట్లో సమృద్ధిగా ఉంటాయి.
6. అరటిపండు
బరువు పెరుగకుండా ఉండాలనుకుంటున్నవాళ్లు అరటిపళ్లకు చాలా దూరంగా ఉంటారు. నిజానికి అరటిలో చాలా సుగుణాలు ఉన్నాయి. దీన్ని రోజు తీసుకోవడం వలన ఎత్తు పెరగడంతో పాటు హెయిర్ లాస్ కూడా తగ్గుతుంది.
7. సోయాబీన్
ఎత్తు పెరగడానికి సోయాబీన్ చాలా ఉపయోగపడుతుంది. రోజు 50గ్రాముల తీసుకోవడం వల్ల త్వరగా ఎత్తు పెరుగవచ్చు. దీంట్లో ఫైబర్, కార్భోహైడ్రే ట్స్ అధిక స్థాయిలో ఉంటాయి.
8. పాలు
రోజు ఒక గ్లాస్ పాలు తాగడం వల్ల ఎత్తు పెరుగవచ్చు.దీంట్లో విటమిన్ బీ12, డీ తో పాటు కాల్షియం ఉంటుంది.