ఫైనల్లో రుత్విక, రీతుపర్ణ
ఇండియా ఇంటర్నేషనల్ సిరీస్ టోర్నీ
సాక్షి, హైదరాబాద్: ఇండియా ఇంటర్నేషనల్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో తెలుగమ్మాయి, టాప్ సీడ్ గద్దె రుత్విక శివాని ఫైనల్లోకి ప్రవేశించింది. మూడో సీడ్ రీతుపర్ణ దాస్‌తో ఆమె టైటిల్ పోరులో అమీతుమీ తేల్చుకోనుంది. గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీలో శనివారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో శివాని 13-11, 11-5, 11-3తో 8వ సీడ్ శ్రీకృష్ణప్రియను ఓడించగా, రీతుపర్ణ 9-11, 12-10, 11-6, 11-6తో శ్రుతి మందనపై విజయం సాధించింది.
పురుషుల సెమీఫైనల్లో లక్ష్యసేన్ 11-8, 11-6, 11-5తో టాప్‌సీడ్ శ్రేయాన్‌ష జైశ్వాల్‌కు షాకిచ్చాడు. తొమ్మిదో సీడ్ జి జియా లీ (మలేసియా) 11-13, 11-9, 11-3, 8-11, 11-7తో జున్ వీ చిమ్ (మలేసియా)పై నెగ్గాడు. పురుషుల డబుల్స్ సెమీస్‌లో సి ఫి గో- నూర్ ఇజుద్దీన్ (మలేసియా) జోడి 11-6, 8-11, 9-11, 13-11, 14-12తో అర్జున్-రామచంద్రన్ శ్లోక్పై జంటపై గెలిచింది. సాత్విక్ సారుురాజ్-చిరాగ్ షెట్టి ద్వయం 11-6, 11-8, 15-13తో అరోన్ చియా-జిన్ హ తన్ (మలేసియా) జంటపై గెలిచింది. మిక్స్డ్ డబుల్స్ సెమీఫైనల్లో సాత్విక్ సారుురాజ్-మనీష జోడి 11-4, 11-8, 11-6తో బషీర్ సయ్యద్-సాహితి జంటపై విజయం సాధించింది. హంగ్ రుు లో- రుు సి చి (మలేసియా) జంట 11-7, 11-8, 6-11, 12-10తో విఘ్నేశ్ దేవ్లేకర్-కుహు గార్గ్ జోడిపై నెగ్గింది.