రిజిస్ట్రార్ సంతకం ఫోర్జరీ
ఎస్కేయూ : దూరవిద్యా కేంద్రం స్టడీ సెంటర్ నిర్వాహకుడు ఎస్కేయూ రిజిస్ట్రార్ సంతకాన్ని ఫోర్జరీ చేసిన ఉదంతం శుక్రవారం వెలుగులోకి వచ్చింది. స్టడీ సెంటర్ల అఫిలియేషన్‌ను ప్రతి ఏటా రెన్యువల్ చేసుకోవాలి. ఇందులో భాగంగా స్టడీ సెంటర్‌ను నిర్వహిస్తున్న కళాశాల వివరాలు, బిల్డింగ్ డ్యాకుమెంట్స్, ల్యాండ్ డ్యాకుమెంట్స్, ఫిక్స్డ్ డిపాజిట్ల బాండ్లు తదితర వాటిని అందివ్వాలని దూరవిద్య డైరెక్టర్ కోరారు. ఈ నేపథ్యంలో చిత్తూరు జిల్లాకు చెందిన ఒక స్టడీ సెంటర్ నిర్వాహకుడు ఏకంగా రిజిస్ట్రార్ సంతకాన్ని ఫోర్జరీ చేసుకొని అఫిలియేషన్స్ డాక్యుమెంట్స్ అందించారు. మోసాన్ని పసిగట్టిన దూరవిద్య డైరెక్టర్ ఏకంగా స్టడీసెంటర్ గుర్తింపును రద్దు చేశారు.