regina cassendra
-
నచ్చితే రూ.100ల టీషర్ట్ అయినా వేసుకుంటా : నటి
రెజీనా.. ఆన్ స్క్రీన్ అయినా.. ఆఫ్ స్క్రీన్ అయినా సహజంగా కనిపించడానికే ఇష్టపడుతుంది. అదే ఆమె స్టయిల్ అయింది. ఆ శైలిని ట్రెండ్‌గా మార్చేసిన బ్రాండ్స్ ఏవంటే.. ఫారిన్ ఫ్యాషన్స్‌కు స్వదేశీ టచ్ అనుశ్రీ బ్రహ్మభట్.. చిన్నప్పటి నుంచి ఫ్యాషన్ ప్రపంచంలోనే పెరిగింది. తల్లి పెద్ద ఫ్యాషన్ డిజైనర్ కాకపోయినా చక్కటి టైలర్. అందమైన డిజైన్స్‌తో దుస్తులు కుట్టేది. దీంతో అనుశ్రీకి ఫ్యాషన్‌పై మక్కువ పెరిగింది. లండన్ ఎస్ఎస్డీటీ యూనివర్సిటీలో చదివి, ఫ్యాషన్ డిజైనర్‌గా మారింది. 2015లో ముంబైలో ‘లేబుల్ అనుశ్రీ’ పేరుతో సంస్థ స్థాపించింది. ఫారిన్ ఫ్యాషన్స్‌ను ఆనుసరించి స్వదేశీ డిజైన్స్ చేయడం ఈమె ప్రత్యేకత. ఎక్కువగా సంప్రదాయ చేనేత కళకు ప్రాధాన్యం ఇస్తుంది. కస్టమర్ అభిరుచి, బడ్జెట్‌కు తగ్గట్టుగా రూ. వేల నుంచి లక్షల వరకు డిజైన్ చేయగలదు. పలు ప్రముఖ ఆన్లైన్ స్టోర్స్ అన్నిటిలోనూ అనుశ్రీ కలెక్షన్స్ లభిస్తాయి. నియతి డిజైన్స్.. నియతి అంటే సంస్కృతంలో విధి. పేరుకు తగ్గట్టుగానే స్థాపించిన కొన్ని రోజుల్లోనే ఆ బ్రాండ్ రాత మారిపోయింది.. ఆకర్షణీయమైన డిజైన్స్ వల్ల. ఇక్కడ లభించే ప్రతి ఆభరణాన్నీ చేత్తోనే తయారు చేస్తారు. అదీ ప్రత్యేకమైన పాత పద్ధతులను అవలంబించి. అదే నియతి బ్రాండ్ వాల్యూ. దీనిద్వారా అంతరించి పోతున్న గిరిజనకళా నైపుణ్యాన్ని కాపాడుతున్నారు. సాధారణంగా ఈ ఆభరణాల కోసం రాగి, వెండి లోహాలను ఉపయోగిస్తారు. అయితే ఈ బ్రాండ్ జ్యూయెలరీలో వాడే మెటల్ కన్నా వాటి కళాత్మకమైన డిజైన్స్‌కే విలువ ఎక్కువ. కొన్ని ఆభరణాలు రూ. లక్షల్లో కూడా ఉంటాయి. కేవలం నియతి ఒరిజిన్ వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, వెబ్సైట్, స్టోర్స్‌లో మాత్రమే వీటిని కొనుగోలు చేయొచ్చు. బ్రాండ్ వాల్యూ జ్యూయెలరీ బ్రాండ్: నియతి హారం: పరమ కలెక్షన్స్ ట్రైబల్ నెక్‌పీస్ ధర: రూ. 29,000 డ్రెస్.. మస్డడ్ లెహంగా అండ్ ఆర్గంజా నాటెడ్ షర్ట్ బ్రాండ్: లేబుల్ అనుశ్రీ ధర: రూ. 22,000 కమ్మలు అద్వితీయ కలెక్షన్స్ ఇయరింగ్స్ ధర: రూ. 5,290 ఫలానా బ్రాండ్ నుంచి ఇది లాంచ్ చేశారు. వెంటనే దానిని కొనాలి, వేసుకోవాలి అని నాకు ఎప్పుడూ ఉండదు. వంద రుపాయల టీషర్ట్ అయినా సరే.. నాకు నచ్చితే వేసుకుంటా– రెజీనా ∙దీపిక కొండి -
ఎన్నాళ్ళకు ఓ రూమర్!
రెజీనా మాతృభాష తమిళం అయినప్పటికీ, తెలుగులో వరుసగా చిత్రాలు చేస్తూ ఇక్కడి అమ్మాయిలా అయిపోయారు. తెలుగులో మంచి గుర్తింపు వచ్చినందుకు చాలా ఆనందంగా ఉందన్నారామె. గోపీచంద్ సరసన రెజీనా నటించిన ‘సౌఖ్యం’ నేడు తెరకొస్తోంది. ఏ.యస్ రవికుమార్ చౌదరి దర్శకత్వంలో వి. ఆనందప్రసాద్ నిర్మించారు. ఇక... రెజీనా కసండ్రా ఏమంటున్నారో తెలుసుకుందాం. రవికుమార్ దర్శకత్వంలో నేను చేసిన ‘పిల్లా నువ్వు లేని జీవితం’ నాది సీరియస్‌గా సాగే పాత్ర. మళ్లీ ఆయనతో చేసిన ఈ సినిమాలో నేను కామెడీ కూడా చేశాను. గోపీచంద్, రవికుమార్ చౌదరి, ఆనంద్‌ప్రసాద్ కాంబినేషన్ కాబట్టి, ఈ సినిమాకి అడగ్గానే ఒప్పేసుకున్నాను. భవ్య క్రియేషన్స్ యాక్టర్స్‌ను ట్రీట్ చేసే విధానం నాకు నచ్చుతుంది. గోపీచంద్ చాలా మంచి వ్యక్తి. ఈ చిత్రం ద్వారా మరో సక్సెస్ అందుకుంటాననే నమ్మకం ఉంది. ఇండస్ట్రీలోకి వచ్చేటప్పుడు నేనింత బిజీ హీరోయిన్ అవుతానని అనుకోలేదు. షార్ట్ ఫిలిమ్స్‌లో యాక్ట్ చేసేటప్పుడు ‘ఎస్.ఎమ్.ఎస్’ సినిమాకు అవకాశం వచ్చింది. ఆ సినిమా ఫలితాన్ని బట్టి ఇక్కడ ఉండాలా? చదువు కంటిన్యూ చేయాలా? నిర్ణయించుకుందామనుకున్నా. కానీ వరుసగా సినిమా ఆఫర్లు రావడంతో ఇక్కడే ఉండాలని ఫిక్స్ అయ్యాను. నంబర్ గేమ్ గురించి నేనెప్పుడూ ఆలోచించలేదు. నాకంటూ కొన్ని స్టాండర్డ్స్ ఉంటాయి. వాటి ని రీచ్ కావాలనేదే నా ప్రయత్నం. సాయిధరమ్‌తేజ్‌తో నాకు లవ్ ఎఫైర్ ఉన్నట్లు రూమర్లు వస్తున్నాయి. మూడేళ్ల బట్టి ఇండస్ట్రీలో ఉన్నాను. ‘నీ మీద గాసిప్స్ రావడం లేదేంటి’ అని అడిగేవాళ్లు. ఎట్టకేలకు ఈ విధంగానైనా ఒక్క రూమర్ వచ్చింది. నేనేంటో నా ఫ్రెండ్స్‌కీ, ఫ్యామిలీ మెంబర్స్‌కీ తెలుసు. తెలుగులో ఇప్పుడు వరుసగా ఆఫర్లు వస్తున్నాయి. అందుకే నా మాతృభాష తమిళం అయినా అక్కడ చేయడం లేదు. అక్కడికి ఓ ఏడాది తర్వాత వెళ్లినా యాక్సెప్ట్ చేస్తారు. అయినా హడావిడిగా రెండు భాషల్లోనూ ఒకేసారి చేయలేను. నాకు సమయం దొరికితే సోషల్ యాక్టివిటీస్‌లో పాల్గొంటా. ప్రస్తుతం ‘టీచ్ ఫర్ ఛేంజ్’, ‘లైఫ్ ఈజ్ బాల్’, ‘ఆదిత్య మెహతా ఫౌండేషన్’ స్వచ్ఛంద సంస్థలకి వర్క్ చేస్తున్నా. క్రిస్మస్ వేడుకలు ఈసారి థియేటర్లోనే. న్యూ ఇయర్ మాత్రం నా ఫ్రెండ్ పెళ్లిలో. అందుకు... చెన్నై వెళ్తున్నా.