8వ రోజూ కొనసాగిన ఉద్యోగుల రిలే నిరాహార దీక్షలు
కాకినాడ: పట్టణంలో వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగుల సమైక్యాంధ్ర ఆందోళనలో 8వ రోజు రిలే నిరాహార దీక్షలు కొనసాగాయి. వాణిజ్య పన్నుల శాఖ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.సత్యనారాయణ శిబిరాన్ని సందర్శించారు. ఈ ఉద్యమం ఉద్యోగుల సమస్యలపై కాదని, ప్రజల ఆకాంక్ష ప్రకరమే చేస్తున్నామని ఆయన ఈ సందర్భంగా చెప్పారు. సంఘం జిల్లా శాఖ అధ్యక్షుడు విజయకుమార్, కోశాధికారి రామనాథం తదితరులు మాట్లాడారు. వాణిజ్య పన్నుల శాఖ నిఘా విభాగం ఉద్యోగులు నిరాహార దీక్షలో పాల్గొన్నారు.
గత కొన్ని రోజులుగా సీమాంధ్రలో కొనసాగుతున్న ఉద్యమానికి ప్రజలు పెద్ద ఎత్తున మద్దతు తెలుపుతున్నారు. వీరికి ఉద్యోగ సంఘాలు కూడా తోడవడంతో నిరసన జ్వాలలు ఎగసి పడుతున్నాయి. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ వారు నినాదాలు చేస్తున్నారు.