ఆ పాలు విషపూరితం
► రిలయన్స్, నెస్లే పాల ఉత్పత్తులపై మంత్రి సంచలన ఆరోపణలు
చెన్నై: రిలయన్స్, నెస్లే పాల పౌడర్లలో రసాయనాలు ఉన్నాయని తమిళనాడు పాడి, డెయిరీల అభివృద్ధి శాఖ మంత్రి కేటీ రాజేంద్రబాలాజీ ఆరోపించారు. ప్రైవేటు పాలల్లో రసాయనాలు ఉన్నట్లుగా ఇటీవల మంత్రి ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారం చర్చకు దారి తీసిన నేపథ్యంలో బుధవారం చెన్నైలో మంత్రి మీడియాతో మాట్లాడారు. తమ పరిశోధనలో రిలయన్స్, నెస్లే పాల పౌడర్లలో గ్యాస్ట్రిక్ , బ్లీచింగ్ పౌడర్లు ఉన్నట్టు నిర్ధారించినట్లు మంత్రి వెల్లడించారు.
ఈ రెండు సంస్థలు చెడిపోయిన పాలను పౌడర్లుగా మార్చే క్రమంలో పౌడర్లను కలుపుతున్నట్లు నిర్ధారించామన్నారు. అలాగే ప్రైవేటు పాలల్లోని రసాయనాల నిర్ధారణకు పరిశోధనలు సాగుతున్నాయని వివరించారు. మిగిలిన సంస్థల పాల ఉత్పత్తుల నమూనాలు పరిశోధనలో ఉన్నాయని, వాటి నివేదిక రాగానే చర్యలు తీసుకుంటామన్నారు.