మతతత్వపార్టీలకు మద్దతు ఇవ్వకండి
వినాయక్‌నగర్, న్యూస్‌లైన్ : మతతత్వపార్టీలకు మద్దతు ఇవ్వవద్దని, తమతోనే సమన్యాయం జరుగుతుందని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదొద్దీన్ఓవైసీ అన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో మంగళవారం జిల్లాకు విచ్చేశారు. నిజామాబాద్‌లోని పులాంగ్ కమిటీ హాలు, కోజాకాల నీ, ముజాహిద్‌నగర్, ఖిల్లారోడ్డులలో బహిరంగసభలు నిర్వహించారు. ఇక్కడ మాట్లాడుతూ అధికా రి పార్టీ తొలిమేయర్ ధర్మపురి సంజయ్ ఐదేళ్లలో కేవలం ఐదుసార్లు మాత్రమే కార్పొరేషన్లో సమావేశం నిర్వహించాడని, ఇదో పెద్ద జోక్ అని అన్నారు.
నగరంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు. నగరంతో పాటు ముస్లిం మైనార్టీ ఏరియాల్లో మౌలి క సదుపాయాలు కల్పించడంలో విఫలమయ్యా రు. తమ పార్టీలో ఎస్సీ, ఎస్టీలతో సహా అన్ని వర్గా ల వారు ఉన్నారని, మాది సెక్యూలర్ పార్టీ అని అన్నారు. అందరూ ఏకం కండి.. తమ అభ్యర్థుల కు ఎక్కువమందిని గెలిపించాలని కోరారు. నెలకొకసారి నిజమాబాద్ వస్తా.. మౌలిక వసతులపై ఆరా తీస్తానని, ప్రజల సౌకర్యాల కోసం పోరాడుతానన్నారు. నగరంలోని పలు చోట్ల ఎంఐఎం పార్టీ నాయకులు కార్పొరేటర్లుగా బరిలో ఉన్న ఆయన బహిరంగసభలు నిర్వహించారు. ఈ సం దర్భంగా ఆయన ప్రసంగిస్తూ బీజేపీ లాంటి మతతత్వ పార్టీలకు మద్దతు ఇవ్వకండి అని ఉద్భోదిం చారు. నగరంలో ఎంఐఎం అభ్యర్థిలను గెలిపించాలని ఆయన కోరారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యేగా బీజేపీ అభ్యర్థిని తిరిగి ఎన్నుకోకుండా తమ పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవాలని నాయకులకు, కార్యకర్తలకు సూచించారు.
తెలంగాణలో టీడీపీ ఖాళీ
బోధన్‌టౌన్: మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా అసదొద్దీన్ బోధన్‌లో రోడ్‌షో నిర్వహించారు.
పట్టణంలోని 1, 2, 3, 4, 9,1011,12, 25 వార్డులలో ప్రచారం చేపట్టారు. తెలంగాణలో పార్టీ బలోపేతం కావాలంటే మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. మున్సిపల్ బరిలో పార్టీ నుంచి పోటీ చేస్తున్న 23 మంది అభ్యర్థులను గెలిపించాలన్నారు. తెలంగాణలో టీడీపీ పార్టీ ఖాలీ అయ్యిందని, బలమైన రాజకీయ శక్తిగా ఎదిగే అవకాశం ఎంఐఎంకు వచ్చిందన్నారు. ఆయన వెంట ఎంఐఎం నాయకులు బాబర్, అలీమ్, గంగాధర్ ఉన్నారు.