కన్నడలో రీమేక్ కానున్న పెళ్లిచూపులు
సాక్షి, బెంగళూరు: తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కి భారీ లాభాలతో తెలుగులో బ్లాక్‌బస్టర్ చిత్రంగా ఘనవిజయం సాధించిన పెళ్లిచూపులు చిత్రాన్ని కన్నడలోకి రీమేక్ కానుందని సమాచారం. తెలుగులో విజయ్ దేవరకొండ, రీతూవర్మ జంటగా నటించగా కన్నడలో ఫస్ట్ ర్యాంక్ రాజులో హీరోగా నటించిన గురునందన్, యూటర్న్ చిత్రంలో తన నటనతో శాండల్ఉడ్ను తన వైపు తిప్పుకున్న శ్రద్ధా శ్రీనాథ్‌లు హీరో హీరోరుున్లు నటించనున్నారని సమాచారం. తెలుగులో తరుణ భాస్కర్ దాస్యమ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కన్నడలో డ్యాన్స మాస్టర్, డెరైక్టర్ మురళి మాస్టర్ దర్శకత్వం వహించనున్నారని శాండల్ఉడ్ వర్గాల వినికిడి.
ఓవర్సీస్లో మిలియన్ డాలర్ క్లబ్లో అడుగుపెట్టిన ఈ చిత్రం తమిళ రీమేక్ రైట్స్‌ను గౌతమ్ వాసుదేవ్ సొంతం చేసుకోగా హిందీలో ప్రముఖ బాలీవుడ్ డెరైక్టర్ కరణ్ జోహార్, హీరో సల్మాన్‌ఖాన్‌లు ఈ చిత్రాన్ని బాలీవుడ్లో రీమేక్ చేయడానికి ఆసక్తిని కనబరుస్తున్నారు. కాగా కన్నడ రీమేక్‌పై దర్శకుడు, హీరో హీరోరుున్ల నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన విడుదల కాలేదు. మరోవైపు కన్నడతో పాటు తమిళంలో కూడా ఆఫర్స్‌ను దక్కించుకుంటూ శ్రద్ధా శ్రీనాథ్ బిజీగా ఉండగా హీరో రఘునందన్ తన తదుపరి చిత్రాలు షూటింగ్లలో నిమగ్నమై ఉన్నారు.