Renaul Kwid
-
వెబ్సైట్లో మాయమైన క్విడ్, ఇక కావాలన్నా కొనలేరు!
భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన హ్యాచ్‌బ్యాక్ కార్లలో ఒకటైన 'రెనాల్ట్ క్విడ్' (Renault Kwid) ఇప్పుడు కంపెనీ అధికారిక వెబ్సైట్లో మాయమైంది. ఇటీవల అమలులోకి వచ్చిన రియల్ డ్రైవింగ్ ఎమిషన్ ఉద్గార ప్రమాణాలను దృష్టిలో ఉంచుకుని కంపెనీ ఈ మోడల్ని నిలిపివేసింది. నివేదికల ప్రకారం.. క్విడ్ మార్కెట్లో మంచి అమ్మకాలను పొందుతున్నప్పటికీ కొత్త ఉద్గార ప్రమాణాలకు అనుకూలంగా అప్డేట్ చేయడం ఖర్చుతో కూడుకున్న పని. ఈ హ్యాచ్‌బ్యాక్ ఏ విధమైన అప్డేట్ పొందినప్పటికీ ధరల పెరుగుదల పొందుతుంది. అప్పుడు అమ్మకాలు తగ్గే అవకాశం ఉంటుంది. ఈ కారణంగానే కంపెనీ ఈ 800cc వెర్షన్‌ను తొలగించింది. రెనాల్ట్ క్విడ్ 0.8 లీటర్ వెర్షన్ RXL, RXL(O) వేరియంట్లలో అందుబాటులో ఉంది. 800cc వేరియంట్ నిలిపివేయడంతో, రెనాల్ట్ ఇప్పుడు ఐదు వేరియంట్లలో 1.0 లీటర్ వెర్షన్‌ను మాత్రమే అందిస్తుంది. క్విడ్ 800 సీసీ వేరియంట్ త్రీ సిలిండర్, న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 52 బిహెచ్పి పవర్, 72 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది కేవలం 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో మాత్రమే అందుబాటులో ఉంటుంది. (ఇదీ చదవండి: HYD ORR: ఓఆర్ఆర్ 30 ఏళ్ల లీజుకి రూ. 8వేల కోట్లు: రేసులో ఆ నాలుగు కంపెనీలు) రెనాల్ట్ కంపెనీ కంటే ముందు మారుతి సుజుకి తన ఎంట్రీ-లెవల్ హ్యాచ్‌బ్యాక్ ఆల్టో 800ని నిలిపివేసింది. అంతే కాకుండా స్కోడా నుంచి ఆక్టావియా, హోండా జాజ్, 4వ తరం హోండా సిటీ ఉత్పత్తి కూడా నిలిపేయడం జరిగింది. నిజానికి కొత్త నిబంధనలు అమలులోకి రావడం వల్ల ఈ ఉత్పత్తులు నిలిచిపోయాయి. రానున్న రోజుల్లో మరిన్ని ఉత్పత్తులు నిలిచిపోయే అవకాశం ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. -
బెస్ట్ సెల్లింగ్ కార్.. 5 లక్షల కంటే తక్కువ ధరలోనే రెనాల్ట్ క్విడ్
భారత ఆటోమొబైల్ ఇండస్ట్రీలో హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్ కార్లకు భారీ ఆదరణ నెలకొంది. దీనిని క్యాష్ చేసుకునేందుకు పలు ఆటోమొబైల్ కంపెనీలు సరికొత్త మోడల్స్‌ను లాంచ్ చేస్తున్నాయి. తాజాగా ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం రెనాల్ట్ ఇండియా సరికొత్తగా రెనాల్ట్ క్విడ్ MY22 ఆర్ఎక్స్(ఓ)కారును లాంచ్ చేసింది. రెనాల్ట్ క్విడ్‌ను కంపెనీ 2015లో ప్రారంభించగా ఇప్పటివరకు 4 లక్షలకు పైగా క్విడ్ యూనిట్లు అమ్ముడయ్యాయి. క్విడ్ అమ్మకాలను మరింత పెంచేందుగాను రెనాల్ట్ ఇండియా సరికొత్త MY22 రెనాల్ట్ క్విడ్‌ను RXL(O) వేరియంట్‌ను తీసుకొచ్చింది. ఈ కారు 1.0L MT, 0.8L రెండు ఎంపికలలో కొనుగోలుదారులకు అందుబాటులో ఉండనుంది. డిజైన్‌లో సరికొత్తగా..! క్విడ్ క్లైంబర్ ఎడిషన్ కొత్త ఇంటీరియర్, ఎక్స్టీరియర్ కలర్‌తో స్పోర్టీ వైట్ యాక్సెంట్లను కలిగి ఉంది. 8 అంగుళాల టచ్‌స్క్రీన్ MediaNAV ఎవల్యూషన్‌తో ఇన్ఫోటైన్మెంట్ రానుంది. ఇది ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే, వీడియో ప్లేబ్యాక్, వాయిస్ రికగ్నిషన్‌కు సపోర్ట్ చేయనుంది. ఈ కారుకు సిల్వర్ స్ట్రీక్ ఎల్ఈడీ డీఆర్ఎల్తో మరింత ఆకర్షణగా నిలవనుంది. దీంతో పాటుగా రివర్స్ పార్కింగ్ కెమెరా , ఎలక్ట్రికల్‌గా సర్దుబాటు చేయగల ఓఆర్వీఎమ్ ఉన్నాయి. ధర ఎంతంటే..! 2022 రెనాల్ట్ క్విడ్ లాంచ్ ధర రూ. 4.49 లక్షలుగా(ఎక్స్‌షోరూమ్) ఉంది. డ్యూయల్ టోన్ బ్లాక్ రూఫ్‌తో మెటల్ మస్టర్డ్ , ఐస్ కూల్ వైట్, మోనోటోన్ మూన్లైట్ సిల్వర్, జన్స్కార్ బ్లూ కలర్ ఆప్షన్లలో 2022 MY22 రెనాల్ట్ క్విడ్ అందుబాటులో ఉండనుంది. ఇంజన్ విషయానికి వస్తే..! కొత్త క్విడ్‌లో ఎలాంటి మెకానికల్‌గా ఎలాంటి మార్పులు చేయలేదు. రెండు పెట్రోల్ ఇంజన్ల ఎంపికతో అందుబాటులో ఉండనుంది. 0.8-లీటర్ ఇంజన్ క్విడ్ 53 బిహెచ్పి, 72 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేయనుంది. ఇది 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో మాత్రమే లభిస్తుంది. మరొక వేరియంట్ 1.0-లీటర్ ఇంజన్67 బీహెచ్పీ, 91 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. కారు 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో స్టాండర్డ్‌గా వస్తుంది. చదవండి: మహీంద్రా థార్‌కు పోటీ..! సరికొత్తగా రానున్న ఫోర్స్ గుర్ఖా..! -
రెనాల్ట్ కార్ల కొనుగోలుపై రూ.80 వేల వరకు బంపర్ ఆఫర్స్..!
ఫ్రాన్స్‌కు చెందిన మల్టీనేషనల్ ఆటోమొబైల్ దిగ్గజం రెనాల్ట్ ఇండియా వాహన కొనుగోలుదారులకు శుభవార్తను అందించింది. రెనాల్ట్ శ్రేణిలోని కార్ల కొనుగోలుపై బంపర్ ఆఫర్లను కంపెనీ ప్రకటించింది. ఈ ఆఫర్స్ ఈ నెల చివరి వరకు అందుబాటులో ఉండనున్నాయి. రెనాల్ట్ ఇండియా తన మోడల్ లైనప్‌లో పలు ప్రయోజనాలను ప్రకటించింది. రెనాల్ట్ సుమారు రూ 80 వేల వరకు క్యాష్ బెనిఫిట్స్, లాయల్టీ బోనస్, కార్పొరేట్ డిస్కౌంట్లను అందించనుంది. చదవండి: Puncture - Proof Tires: ఈ టైర్లు అసలు పంక్చరే కావు..! రెనాల్ట్ అందిస్తోన్న ఆఫర్లు ఆయా మోడల్, ప్రాంతాల్లో మారుతూ ఉంటాయి. ‘బై నౌ, పే ఇన్ 2022’ అనే సరికొత్త స్కీమ్‌తో రెనాల్ట్ ముందుకొచ్చింది. ఈ స్కీమ్ సెలక్టెడ్ కార్లపై మాత్రమే అందుబాటులో ఉంటుంది. అంతేకాకుండా ఈ స్కీమ్‌లో భాగంగా తొలి ఆర్నెల్ల సమయంలో ఈఎమ్ఐ చెల్లించాల్సిన అవసరం లేదు. అంటే కారు కొన్న వెంటనే ఈఎమ్ఐ చెల్లించనక్కర్లేదు. రెనాల్ట్ తన RELi.VE స్క్రాపేజ్ ప్రోగ్రామ్ కింద సుమారు రూ. 10 వేల వరకు ప్రత్యేక ప్రయోజనాలను అందిస్తోంది. ఈ ఆఫర్ క్విడ్ , ట్రైబర్ లేదా డస్టర్‌పై వర్తిస్తుంది. రెనాల్ట్ క్విడ్ క్విడ్ హ్యాచ్‌బ్యాక్ సేల్‌లో రూ.40 వేల వరకు గరిష్ట ప్రయోజనాలతో అమ్మకానికి ఉంది. ఈ ఆఫర్లలో పదివేల వరకు క్యాష్ డిస్కౌంట్, 20 వేల వరకు ఎక్స్ఛేంజ్ బోనస్, పదివేల వరకు కార్పొరేట్ బోనస్ ఉన్నాయి. రెనాల్ట్ ట్రైబర్ ట్రైబర్ ఎమ్పీవీపై రెనాల్ట్ విభిన్న ప్రయోజనాలను అందిస్తోంది. రెనో 2020 మోడల్ ట్రైబర్‌పై కొనుగోలుదారులు సుమారు రూ. 60 వేల వరకు ప్రయోజనాలను పొందవచ్చు. వీటిలో రూ. 25 వేల వరకు క్యాష్ బెనిఫిట్, రూ. 25 వేల వరకు ఎక్స్ఛేంజ్ బోనస్, రూ. 10 వేల వరకు కార్పొరేట్ బోనస్ ఉన్నాయి. 2021 మోడల్ ఇయర్ ట్రైబర్ కొనుగోలు చేసే కస్టమర్లు సుమారు రూ. 50 వేల వరకు ప్రయోజనాలను పొందుతారు. వీటిలో రూ. 15 వేల వరకు క్యాష్ బెనిఫిట్, రూ. 25 వేల వరకు ఎక్స్ఛేంజ్ బోనస్, రూ. 10 వేల వరకు కార్పొరేట్ బోనస్ ఉన్నాయి. రెనాల్ట్ డస్టర్ రెనాల్ట్ డస్టర్ కొనుగోలుపై సుమారు రూ. 80 వేల వరకు బెనిఫిట్స్ అందిస్తోంది. వీటిలో రూ. 30 వేల వరకు క్యాష్ బెనిఫిట్, రూ. 20 వేల వరకు ఎక్స్ఛేంజ్ బోనస్, రూ. 30 వేల వరకు కార్పొరేట్ బోనస్ ఉన్నాయి. ఈ మూడు మోడళ్లకు ‘ఇప్పుడు కొనండి 2022లో చెల్లించండి’ స్కీమ్ వర్తించనుంది. చదవండి: 20 నిమిషాల ఛార్జింగ్‌తో 482 కి.మీ ప్రయాణం..! -
జీఎస్టీ తర్వాత ఈ కార్ల ధరలు పైపైకే..
దేశవ్యాప్తంగా జీఎస్టీ మరికొన్ని రోజుల్లో అమలుకాబోతుండటంతో, పాత ఇన్వెంటరీని విక్రయించుకోవడానికి దాదాపు అన్ని సంస్థలు డిస్కౌంట్ల మీద డిస్కౌంట్లు ప్రకటిస్తూనే ఉన్నాయి. ఇక వాహన రంగ సంస్థల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. భారీ డిస్కౌంట్లతో కార్లను విక్రయానికి తీసుకొచ్చాయి. మెర్సిడెస్ నుంచి ఫోర్డ్ వరకు అన్ని సంస్థలు డిస్కౌంట్ల బాట పట్టాయి. కానీ జీఎస్టీ అమలు తర్వాత వాహనరంగ పరిస్థితి ఎలా ఉండబోతుంది? ఏ కారు కొంటే ఎంత మేర జేబుకు చిల్లుపడుతుంది? ఏ కార్ల ధరలు తగ్గొచ్చూ అనేది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. జీఎస్టీ తర్వాత బడ్జెట్ కార్లు, మాస్-మార్కెట్ కొనుగోలు చేసే కార్ల ధరలు 3 శాతం నుంచి 5 శాతం పైకి ఎగుస్తాయని తెలుస్తోంది. అంటే కారు ధర రూ.5 లక్షలు ఉందనుకోండి.. ఈ కారు ధర జీఎస్టీ అమలు తర్వాత రూ.15వేల నుంచి రూ.25వేల మేర పెరుగుతుంది. మార్కెట్లో ఎక్కువగా పాపులర్ కారు అయిన మారుతీ సుజుకీ ఆల్టో ధర కూడా అత్యధికంగా పైకి ఎగుస్తుందట. ప్రస్తుత పన్ను రేటు దీనిపై 25-27.5శాతముంటే, అది కాస్త 29శాతం కంటే పైగా పెరుగుతోంది. దీంతో ఆల్టో ధరలు పెరుగనున్నాయి. ప్రస్తుతం మారుతీ సుజుకీ డీలర్లు ఆల్టో, స్విఫ్ట్ లపై రూ.25వేల నుంచి రూ.35వేల వరకు డిస్కౌంట్లను అందిస్తోంది. ఇతర కారు సంస్థలు కూడా డిస్కౌంట్లను ఆఫర్ చేస్తున్నాయి. హ్యుందాయ్ రూ.25వేల నుంచి రూ.2 లక్షల 50వేల వరకు ధర ప్రయోజనాలను అందింస్తుండగా.. డాట్సన్ సంస్థ ఉచిత ఇన్సూరెన్స్, తగ్గింపు వడ్డీరేట్లను అందిస్తోంది. ఒక్క మారుతీ ఆల్టో ధర మాత్రమే కాక, రెనాల్డ్ క్విడ్ ధర కూడా దాదాపు రూ.7,500 వరకు పెరుగనుంది. ప్రస్తుతం రెనాల్డ్ క్విడ్ ధర రూ.3,32,312(ఎక్స్ షోరూం-ఢిల్లీ) ఉంది. దీని పన్ను రేటు జీఎస్టీతో 26శాతం నుంచి 29శాతానికి పెరుగుతోంది. ఈ పన్ను పెరగడమే కారు ధర పైకి ఎగియడానికి దోహదం చేస్తోంది. హోండా సిటీ కారు కూడా రూ.10,735మేర పెరుగుతోంది. ప్రస్తుతం దీని ధర 10,12,797 రూపాయలుగా ఉంది. జీఎస్టీతో ఎక్కువగా డీజిల్ కార్లు ప్రభావం చెందుతాయని, వీటి ధరలు 21వేల రూపాయల వరకు పెరుగనున్నాయని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. మారుతీ సుజుకీ డిజైర్ ధర ఎక్స్ షోరూం-ఢిల్లీలో ప్రస్తుతం రూ.7,76,000 ఉంటే, అది కాస్త జీఎస్టీ తర్వాత 21వేల రూపాయలు పెరిగి, 7,97,300 రూపాయలకు చేరుకోనుంది.