Rental housing
-
చవగ్గా అద్దె గృహ సముదాయాలు
న్యూఢిల్లీ: పట్టణాల్లోని వలస కూలీలు, పేదల కోసం చవకగా అద్దె గృహ సముదాయాలను(అఫర్డబుల్ రెంటల్ హౌజింగ్ కాంప్లెక్సెస్– ఏఆర్‌హెచ్‌సీ) అభివృద్ధి చేయాలన్న ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన భేటీలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. వలస కార్మికులకు.. తాము పని చేసే ప్రదేశాలకు దగ్గరలో చవకగా అద్దె ఇళ్లు అందించే ఉద్దేశంతో ఈ పథకం ప్రారంభించనున్నారు. ఇందులో భాగంగా, ప్రభుత్వ నిధులతో నిర్మితమై, ప్రస్తుతం ఖాళీగా ఉన్న హౌజింగ్ కాంప్లెక్స్‌లను 25 ఏళ్ల కన్సెషన్ అగ్రిమెంట్ ద్వారా ఏఆర్‌హెచ్‌సీలుగా మారుస్తారు. పట్టణ ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకంలో భాగంగా ఏఆర్‌హెచ్‌సీని అభివృద్ధి చేస్తారు. కన్సెషన్ అగ్రిమెంట్ పొందిన వ్యక్తి/సంస్థ ఆ భవన సముదాయానికి మరమ్మతులు చేసి, ఇతర సదుపాయాలు కల్పించి ఆవాసయోగ్యంగా మారుస్తారు. ఈ పథకానికి టెక్నాలజీ ఇన్నోవేషన్ గ్రాంట్ కింద రూ. 600 కోట్లను కేటాయించారు. కన్సెషన్ అగ్రిమెంట్‌దారులను పారదర్శకమైన బిడ్డింగ్ ప్రక్రియ ద్వారా ఆయా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు నిర్ణయిస్తాయి. 25 ఏళ్ల అగ్రిమెంట్ కాలం ముగిసిన తరువాత, ఆ కాంప్లెక్స్‌లు స్థానిక ప్రభుత్వాల ఆధీనంలోకి వెళ్తాయి. అనంతరం మళ్లీ బిడ్డింగ్ ప్రక్రియ జరుగుతుంది. సొంత భూమిలో ఏఆర్‌హెచ్‌సీలను నిర్మించాలనుకునే వారికి ప్రత్యేక అనుమతులు, సదుపాయాలు, ప్రత్యేక రుణ సౌకర్యాలు కల్పిస్తారు. పన్ను చెల్లింపుల్లోనూ రాయితీ ఇస్తారు. ఈ పథకం ద్వారా 3.5 లక్షల మంది లబ్ధి పొందుతారని ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ పథకాన్ని మే 14న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రకటించారు. కరోనా వైరస్ కారణంగా ప్రకటించిన లాక్‌డౌన్‌తో ఇబ్బంది పడుతున్న ఉజ్వల పథకం లబ్ధిదారులైన పేద మహిళల కోసం ప్రకటించిన మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లను.. వారు సెప్టెంబర్ చివరి వరకు తీసుకోవచ్చని కేంద్రం ప్రకటించింది. ఇప్పటివరకు మూడు ఉచిత సిలిండర్లను తీసుకోని వారికి మాత్రమే ఈ సదుపాయం వర్తిస్తుంది. ‘ఉచిత రేషన్’కు కేబినెట్ ఆమోదం ఇటీవల దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన నవంబర్ వరకు ఉచిత రేషన్ కార్యక్రమానికి బుధవారం కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. కరోనా కల్లోలం నేపథ్యంలో.. ఉపాధి కోల్పోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్న పేదల ఆకలి తీర్చేందుకు నవంబర్ వరకు ఉచిత రేషన్ పథకాన్ని కొనసాగించనున్నట్లు జూన్ 30న మోదీ ప్రకటించిన విషయం తెలిసిందే. -
ఇంటి ఓనర్ ఇంట్లోనే చోరీ
బోడుప్పల్: అద్దెకు ఉంటూ... సదరు ఇంటి ఓనర్ ఇంట్లో చోరికి పాల్పడిన యువకుడిని మేడిపల్లి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. డీఐ దేవేందర్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. పీర్జాదిగూడ మున్సిపల్ పరిధిలోని సిరిపురి కాలనీలో ఉంటున్న నరేంద్ర మేస్త్రిగా పని చేస్తున్నాడు. వారం రోజుల క్రితం అతను ఇంటికి తాళం వేసి ఊరికి వెళ్లాడు. తిరిగి వచ్చే సరికి గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి తాళం పగులకొట్టి బీరువాలో ఉన్న మూడు తులాల నెక్లెస్ ఎత్తుకెళ్లినట్లు గుర్తించిన అతను మేడిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈక్రమంలో గురువారం మేడిపల్లి కమాన్ వద్ద తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు అనుమానాస్పదంగా కనిపించిన విజయేంద్ర అనే యువకుడిని అదుపులోకి తీసుకుని విచారించారు. గద్వాల్‌జిల్లా, ఐజా మండలం రాజపురం గ్రామానికి చెందిన విజయేంద్ర గత కొంత కాలంగా నరేంద్ర ఇంట్లో అద్దెకు ఉంటూ కూరగాయల వ్యాపారం చేస్తున్నాడు. వారం రోజుల క్రితం అతను నరేంద్ర ఇంటికి తాళం పగులకొట్టి నెక్లెస్ చోరీ చేసినట్లు విచారణలో తేలింది. మేడిపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో రెండు బైక్‌లు చోరీ చేసినట్లు గుర్తించారు. నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. అతడి నుంచి 3 తులాల నెక్లెస్ , రెండు బైక్‌లు స్వాధీనం చేసుకున్నారు. -
పోలీసులకు ‘అద్దె’ భారం
కామారెడ్డి : నీళ్లు లేని క్వార్టర్లలో నివాసం ఉండలేమంటూ పోలీసు కుటుంబాలు ఖాళీ చేశాయి. అద్దె ఇళ్లలో ఉంటున్నాయి. అయితే వారి వేతనాల్లోంచి అద్దె కట్ అవుతూనే ఉంది. దీంతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు దేవునిపల్లి పోలీసులు. జిల్లా కేంద్రంలోని దేవునిపల్లిలో జాతీయ రహదారికి సమీపంలో పదేళ్ల క్రితం దేవునిపల్లి పోలీసు స్టేషన్‌ను నిర్మించారు. అక్కడే ఎస్సై క్వార్టర్‌తో పాటు 12 కుటుంబాలకు క్వార్టర్లు కట్టారు. అయితే అక్కడ నీ టి సమస్య తీవ్రంగా ఉంది. బోర్లు వేయించినా నీరు పడకపోవడంతో పోలీసు కుటుంబాలు క్వార్టర్లలో ఉం డలేకపోయా యి. కొందరు ట్యాంకర్ల ద్వారా నీటిని కొ నుగోలు చేసి కొంతకాలం గడిపారు. ట్యాంకర్ల భారం మోయలేక ఒక్కో కుటుంబం క్వార్టర్‌ను ఖాళీ చేసి అద్దె ఇళ్లలోకి వెళ్లిపోయింది. 12 క్వార్టర్లలో నాలుగు కుటుంబాలు మాత్రమే ఉంటున్నాయి. వీరు సమీపంలో ఉన్న స్టేడియానికి సంబంధించిన బోరు నీళ్లను వాడుకుంటున్నారు. మిగతా ఎనిమిది కుటుంబాలు అద్దె ఇళ్లలో లేదా సొంత ఇళ్లలో ఉంటున్నాయి. వేతనంలో కోత.. దేవునిపల్లి పోలీస్ స్టేషన్లో పనిచేసే సిబ్బందికి క్వార్టర్లను కేటాయించారు. అక్కడ నివాసం ఉన్నప్పుడు వేతనంలో 14.5 హెచ్ఆర్ఏ కోత పడేది. అప్పుడు పెద్దగా ఇబ్బంది పడేవారు కాదు. క్వార్టర్లలో నివాసం ఉన్నందుకు వేతనంలో నుంచి ఇంటి అద్దె కట్ అయ్యేది. కానీ ఇప్పుడు అక్కడ నివాసం ఉండకున్నా వారి వేతనాల్లోనుంచి అద్దె కోత పడుతూనే ఉంది.