కామారెడ్డి : నీళ్లు లేని క్వార్టర్లలో నివాసం ఉండలేమంటూ పోలీసు కుటుంబాలు ఖాళీ చేశాయి. అద్దె ఇళ్లలో ఉంటున్నాయి. అయితే వారి వేతనాల్లోంచి అద్దె కట్ అవుతూనే ఉంది. దీంతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు దేవునిపల్లి పోలీసులు. జిల్లా కేంద్రంలోని దేవునిపల్లిలో జాతీయ రహదారికి సమీపంలో పదేళ్ల క్రితం దేవునిపల్లి పోలీసు స్టేషన్‌ను నిర్మించారు. అక్కడే ఎస్‌సై క్వార్టర్‌తో పాటు 12 కుటుంబాలకు క్వార్టర్లు కట్టారు. అయితే అక్కడ నీ టి సమస్య తీవ్రంగా ఉంది. బోర్లు వేయించినా నీరు పడకపోవడంతో పోలీసు కుటుంబాలు క్వార్టర్లలో ఉం డలేకపోయా యి.
కొందరు ట్యాంకర్ల ద్వారా నీటిని కొ నుగోలు చేసి కొంతకాలం గడిపారు. ట్యాంకర్ల భారం మోయలేక ఒక్కో కుటుంబం క్వార్టర్‌ను ఖాళీ చేసి అద్దె ఇళ్లలోకి వెళ్లిపోయింది. 12 క్వార్టర్లలో నాలుగు కుటుంబాలు మాత్రమే ఉంటున్నాయి. వీరు సమీపంలో ఉన్న స్టేడియానికి సంబంధించిన బోరు నీళ్లను వాడుకుంటున్నారు. మిగతా ఎనిమిది కుటుంబాలు అద్దె ఇళ్లలో లేదా సొంత ఇళ్లలో ఉంటున్నాయి.
వేతనంలో కోత..
దేవునిపల్లి పోలీస్ స్టేషన్‌లో పనిచేసే సిబ్బందికి క్వార్టర్లను కేటాయించారు. అక్కడ నివాసం ఉన్నప్పుడు వేతనంలో 14.5 హెచ్‌ఆర్‌ఏ కోత పడేది. అప్పుడు పెద్దగా ఇబ్బంది పడేవారు కాదు. క్వార్టర్లలో నివాసం ఉన్నందుకు వేతనంలో నుంచి ఇంటి అద్దె కట్ అయ్యేది. కానీ ఇప్పుడు అక్కడ నివాసం ఉండకున్నా వారి వేతనాల్లోనుంచి అద్దె కోత పడుతూనే ఉంది.
పోలీసులకు ‘అద్దె’ భారం
Published Mon, Jan 2 2017 1:22 AM | Last Updated on Tue, Oct 2 2018 5:51 PM
Advertisement
Advertisement