రెండు కేసుల్లో రిపోర్టర్ అరెస్టు
జగ్గంపేట :
జె.కొత్తూరుకు చెందిన తుట్టా రామయ్య ఆత్మహత్య కేసులో, మరో కేసులో అదే గ్రామానికి చెందిన మీడియా రిపోర్టర్ కుమార్పాల్ను అరెస్టు చేసి రిమాండ్కు పంపినట్టు ఎస్సై అలీఖాన్ శుక్రవారం తెలిపారు. ఆయన చెప్పిన వివరాల ప్రకారం ఇటీవల తన పొలంలో రామయ్య పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుమార్పాల్ వేధింపులతో మనస్తాపం చెందిన తన భర్త ఆత్మహత్యకు పాల్పడినట్టు భార్య ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. అదే గ్రామానికి చెందిన అక్కమ్మ అనే మహిళ తన కుమార్తె మస్కట్లో అనారోగ్యంతో ఉందని చెబితే ఆమెను తీసుకువస్తానని కుమార్పాల్ చెప్పి రూ.30వేలు తీసుకున్నట్టు ఆమె ఫిర్యాదు చేసినట్టు ఎస్సై తెలిపారు. ఈ రెండు కేసుల్లో కుమార్పాల్ను శుక్రవారం అరెస్టు చేయగా కోర్టు రిమాండ్ విధించిందన్నారు.