సాధారణ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల నేడే..
కలెక్టరేట్, న్యూస్‌లైన్ : జిల్లాలో సాధారణ ఎన్నికలకు బుధవారం నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ జి.కిషన్ తెలిపారు. ఎన్నికల కోడ్ నిబంధనలపై అవగాహన కల్పించేందుకు కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్ లో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు, ప్రింటింగ్ ప్రెస్‌ల యజమానులతో మంగళవారం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కరపత్రాలు, వాల్‌పోస్టర్లు ముద్రించే సమయంలో ప్రింటింగ్ ప్రెస్ పేరు,మొత్తం ఎన్ని ప్రతులు ముద్రించార నే విషయాన్ని పేర్కొనాలని సూచించారు. ఇందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తే ప్రెస్‌ల యజమానులపై చర్యలు తీసుకుం టామని స్పష్టం చేశారు. ఆ తర్వాత మీడియా ప్రతినిధుల తో జరిగిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల మయంలో చెల్లింపు కథనాలు నిశితంగా పరిశీలించేందుకు జిల్లా స్థాయిలో మీడియా సర్టిఫికేషన్ కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ప్రతిరోజు పత్రికల్లో వార్తలు పరిశీలించి ఆయా అభ్యర్థులకు నోటీసులు ఇవ్వనున్నట్లు తెలిపా రు. అలాగే, స్థానిక చానళ్లు ముందుగా కమిటీ అనుమతి పొందిన తర్వాతే కథనాలను ప్రసారం చేయాలని సూచిం చారు. ఈ సమావేశంలో జేసీ పౌసుమి బసు, ఆర్బన్ ఎస్పీ వెంకటేశ్వర్రావు, ట్రెయినీ జేసీ అరవిందర్‌సింగ్, సమాచా ర శాఖ డీడీ తిలక్, ఎంసీఎంసీ సభ్యులు జయపాల్‌రెడ్డి, పీ.వీ.మదన్మోహన్, దాసరి కృష్ణారెడ్డి పాల్గొన్నారు.