బాబీ జిందాల్‌కు పెరుగుతున్న మద్దతు
అమెరికా అధ్యక్ష పదవికి రిపబ్లికన్ల తరఫున పోటీపడేందుకు భారతీయ సంతతికి చెందిన లూసియానా గవర్నర్ బాబీ జిందాల్ అన్ని విధాల అర్హుడైన వ్యక్తి అని ఆ రాష్ట ప్రజలు భావిస్తున్నారని తాము చేపట్టిన సర్వేలో వెల్లడైందని రిపబ్లికన్ పార్టీ మంగళవారం ఇక్కడ విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపింది.
దాదాపు 2016లో దేశాధ్యక్ష పదవికి జరగనున్న ఎన్నికల్లో లూసియానా రాష్ట్ర ప్రజలు బాబీ జిందాల్ వైపు మొగ్గు చూపుతున్నారని ఆ సర్వే పేర్కొంది. కాగా ప్రస్తుత అధ్యక్షుడు ఒబామాకు అనుకూలంగా 37 శాతమే ఓటు వేశారని వెల్లడించింది. ఇటీవల అమెరికా అధ్యక్షుడు ఒబామా హెల్త్ కేర్ చట్టంపై సంతకం చేయడంతో స్థానికంగా తీవ్ర నిరసన వ్యక్తం అవుతోంది.
అంతేకాకుండా అమెరికన్లు ఆ చట్టాన్ని ఒబామా కేర్ అని వ్యాఖ్యానిస్తున్నారు. అయితే బాబీ జిందాల్ వరుసగా రెండో సారి లూసియానా గవర్నర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అయితే మూడో సారి ఆయన ఆ పదవిని చేపట్టేందుకు అంతగా ఇష్టపడటం లేదని పలువురు వెల్లడిస్తున్నారు.