సద్దాం హుసేన్ చేసిన మంచిపని తెలుసా?
వాషింగ్టన్: వివాదాస్పద, సంచలన వ్యాఖ్యలతో దుమారం రేపుతున్న రిపబ్లికన్ అమెరికా అధ్యక్ష పదవి అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ ఎన్నకల ప్రచారంలో మరోసారి ఇరాక్ మాజీ అధ్యక్షుడు సద్దాం హుసేన్ పేరును ప్రస్తావించారు. అమెరికాకు బద్దశత్రువైన సద్దాంను ట్రంప్ ప్రశంసించి అందర్నీ ఆశ్చర్యపరిచారు. మంగళవారం ఎన్నికల ప్రచారంలో ట్రంప్ మాట్లాడుతూ.. సద్దాం తన పాలనలో ఉగ్రవాదులను ఏరివేశారని, ఇది మంచిపరిణామని అన్నారు.
‘సద్దాం హుసేన్ చెడు వ్యక్తి. నిజామా? ఆయన నిజంగా చెడు వ్యక్తే. అయితే ఆయన చేసిన మంచిపని గురించి మీకు తెలుసా? సద్దాం టెర్రరిస్టులను చంపించాడు. ఆయన అలా చేయడం చాలా మంచి పని. ఆ రోజు ఇరాక్ ఉగ్రవాదులకు అడ్డాగా మారిపోయింది. ఉగ్రవాదానికి ఇరాక్ హార్వర్డ్ యూనివర్సిటీలాంటిది. ఎవరైనా ఉగ్రవాది కావాలనుకుంటే ఇరాక్ వెళ్లాలి. నిజమే కదా? ఇది చాలా బాధాకరం’ అని ట్రంప్ అన్నారు. ట్రంప్ గతంలోనూ సద్దాం, ఇతర నియంతలను ప్రశంసించారు. సద్దాం, గడాపీ వంటి నియంతలు ఇప్పటికీ అధికారంలో ఉంటే వందం శాతంగా మెరుగ్గా ఉండేదని అన్నారు.
కాగా ఇరాక్ అధ్యక్షుడిగా సద్దాం హుసేన్ ఉన్నప్పుడు అమెరికా దళాలు దాడులు చేసి, పదవీచ్యుతుడిని చేశాయి. యుద్ధ కోర్టులో సద్దాంను విచారించి ఆయనకు ఉరిశిక్ష విధించారు.